Nitish Kumar: నితీశ్ కుమార్‌కు శుభాకాంక్షలు తెలిపిన తేజస్వీ యాదవ్

Tejashwi Yadav Congratulates Nitish Kumar on Becoming Bihar CM
  • మంత్రి మండలి సభ్యులకు కూడా శుభాకాంక్షలు తెలిపిన తేజస్వీ యాదవ్
  • కొత్త ప్రభుత్వం తన హామీలను బాధ్యతాయుతంగా నెరవేరుస్తుందని ఆశిస్తున్నానన్న తేజస్వీ యాదవ్
  • బీహార్ ప్రజల జీవితాల్లో గుణాత్మక మార్పును తీసుకువస్తుందని ఆశిస్తున్నానన్న తేజస్వీ
బీహార్ ముఖ్యమంత్రిగా పదవసారి ప్రమాణ స్వీకారం చేసిన నితీశ్ కుమార్‌కు ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన 'ఎక్స్' వేదికగా స్పందించారు. "బీహార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నితీశ్ కుమార్‌కు హృదయపూర్వక అభినందనలు. మంత్రి మండలి సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన బీహార్ ప్రభుత్వ మంత్రులందరికీ కూడా అభినందనలు" అని ఆయన పేర్కొన్నారు.

"కొత్త ప్రభుత్వం తమ హామీలను, ప్రకటనలను బాధ్యతాయుతంగా నెరవేరుస్తుందని, ప్రజల ఆశలు మరియు అంచనాలకు అనుగుణంగా పాలన చేస్తుందని ఆశిస్తున్నాను. బీహార్ ప్రజల జీవితాల్లో సానుకూల మరియు గుణాత్మక మార్పును ఈ ప్రభుత్వం తీసుకువస్తుందని ఆశిస్తున్నాము" అని తేజస్వి యాదవ్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.
Nitish Kumar
Tejashwi Yadav
Bihar
Bihar Chief Minister
RJD
Bihar Government

More Telugu News