Indian mobile data users: భారతీయులు నెలకు సగటున ఎంత జీబీ డేటా వాడుతున్నారో తెలుసా?.. ప్రపంచంలో మనమే టాప్!
- నెలకు సగటున 36 జీబీ డేటాను వినియోగిస్తున్న భారతీయులు
- 2031 నాటికి సగటు వినియోగం 65 జీబీకి చేరే అవకాశం
- 2025 చివరి నాటికి 39 కోట్లకు పైగా 5జీ కనెక్షన్ల అంచనా
మొబైల్ డేటా వినియోగంలో భారతీయులు ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలిచారు. దేశంలోని ఒక్కో స్మార్ట్‌ఫోన్ వినియోగదారుడు నెలకు సగటున 36 జీబీ డేటాను వాడుతున్నట్లు ప్రముఖ టెలికాం సంస్థ ఎరిక్సన్ తన మొబిలిటీ రిపోర్ట్‌లో వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా ఇదే అత్యధిక సగటు వినియోగం కావడం గమనార్హం.
ఎరిక్సన్ నివేదిక ప్రకారం, ప్రస్తుతం 36 జీబీగా ఉన్న ఈ సగటు వినియోగం 2031 నాటికి నెలకు 65 జీబీకి చేరుకుంటుందని అంచనా వేశారు. భారత్‌లో 5జీ సేవలు శరవేగంగా విస్తరిస్తుండటంతో డేటా వాడకం మరింత పెరగనుంది. 2025 చివరి నాటికి దేశంలో 5జీ సబ్‌స్క్రిప్షన్ల సంఖ్య సుమారు 39.4 కోట్లకు చేరుతుందని, ఇది మొత్తం మొబైల్ కనెక్షన్లలో 32 శాతంగా ఉంటుందని రిపోర్ట్ పేర్కొంది.
భవిష్యత్తులో 5జీ వినియోగదారుల సంఖ్య మరింత పెరగనుంది. 2031 నాటికి భారత్‌లో 5జీ యూజర్ల సంఖ్య 100 కోట్లు దాటుతుందని, ఇది మొత్తం మొబైల్ వినియోగదారులలో 79 శాతానికి సమానమని నివేదిక అంచనా వేసింది. ఇది దేశంలో డిజిటల్ సేవలు, కనెక్టివిటీ ఎంత వేగంగా అభివృద్ధి చెందుతున్నాయో స్పష్టం చేస్తోంది.