Kachiguda Railway Station: రన్నింగ్ ట్రైన్ దిగుతూ కిందపడ్డ ప్రయాణికుడు.. త్రుటిలో తప్పిన ప్రాణాపాయం.. వీడియో ఇదిగో!

Kachiguda Railway Station Passenger Falls From Moving Train Saved
––
హైదరాబాద్ లోని కాచిగూడ రైల్వే స్టేషన్ లో ఓ ప్రయాణికుడు త్రుటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. వేగంగా వెళుతున్న రైలులో నుంచి ప్లాట్ ఫాంపై దిగేందుకు ప్రయత్నించి కిందపడ్డాడు. ప్లాట్ ఫాంకు రైలుకు మధ్యలో ఇరుక్కుపోయాడు. అక్కడే ఉన్న రైల్వే కానిస్టేబుల్ సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో ఆ ప్రయాణికుడికి ప్రాణాపాయం తప్పింది.

స్టేషన్ లోని సీసీటీవీ కెమెరాలో రికార్డైన ఈ సంఘటకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రయాణికుడిని కాపాడిన ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ పంకజ్ కుమార్ శర్మను అధికారులు అభినందించారు. కదులుతున్న రైలులోకి ఎక్కడం కానీ, దిగడం కానీ చేయొద్దంటూ ప్రయాణికులను హెచ్చరించారు.
Kachiguda Railway Station
Hyderabad
Running train accident
Railway Police
RPF Constable
Pankaj Kumar Sharma
Train accident video
Kachiguda
Train passenger safety
Indian Railways

More Telugu News