కోనసీమ జిల్లాలో మావోయిస్టు కలకలం... హిడ్మా అనుచరుడి అరెస్ట్!

  • హిడ్మా అనుచరుడు మడివి సరోజ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు
  • రావులపాలెంలో ఉన్నట్లు గుర్తించి అరెస్ట్ చేసిన అధికారులు
  • ఎన్‌కౌంటర్‌లో హిడ్మా మృతి చెందిన మరుసటి రోజే సరోజ్ అరెస్ట్
కోనసీమ జిల్లాలో మావోయిస్టు కార్యకలాపాలు కలకలం రేపాయి. మావోయిస్టు అగ్రనేత హిడ్మా అనుచరుడిగా భావిస్తున్న మడివి సరోజ్‌ను పోలీసులు రావులపాలెంలో ఈరోజు అదుపులోకి తీసుకున్నారు. అతడిని అరెస్ట్ చేసి, రహస్య ప్రాంతంలో విచారిస్తున్నట్లు సమాచారం.

మారేడుమిల్లి సమీపంలో నిన్న జరిగిన ఎన్‌కౌంటర్‌లో హిడ్మా మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ఘటన తర్వాత పోలీసులు నిఘాను తీవ్రతరం చేశారు. ఈ క్రమంలో హిడ్మా అనుచరుడిగా ఉన్న మడివి సరోజ్ రావులపాలెంలో తలదాచుకున్నట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీంతో రంగంలోకి దిగిన ప్రత్యేక బృందాలు అతడిని గుర్తించి అరెస్ట్ చేశాయి.

అరెస్టయిన మడివి సరోజ్‌ స్వస్థలం అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక మండలం నెల్లిపాక గ్రామంగా గుర్తించారు. మారేడుమిల్లి ఎన్‌కౌంటర్ తర్వాత ఏజెన్సీ నుంచి తప్పించుకుని కోనసీమ ప్రాంతానికి వచ్చాడా? లేక మరేదైనా కారణంతో ఇక్కడ ఆశ్రయం పొందుతున్నాడా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ అరెస్ట్‌తో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మరోసారి మావోయిస్టుల కదలికలపై చర్చ మొదలైంది.


More Telugu News