Krishna River: కృష్ణా నదిలో వందల సంఖ్యలో పాములు... వీడియో ఇదిగో!

Snakes in Krishna River Astonish Devotees at Nagayalanka Temple
  • కృష్ణా జిల్లా నాగాయలంక శివాలయంలో అరుదైన దృశ్యం
  • ఆలయ పరిసరాల్లో వందలాదిగా ప్రత్యక్షమైన నీటి పాములు
  • కార్తీక మాసంలో ఏటా జరిగే అద్భుతమంటున్న స్థానికులు
  • శివుడి మహిమే కారణమని ప్రగాఢంగా విశ్వసిస్తున్న భక్తులు
కృష్ణా జిల్లా నాగాయలంకలో ఓ అరుదైన సంఘటన స్థానికులను, భక్తులను ఆశ్చర్యానికి గురిచేసింది. పవిత్ర కార్తిక మాసంలో స్థానిక రామలింగేశ్వర స్వామి ఆలయ సమీపానికి వందలాది నీటి పాములు తరలివచ్చాయి. ఆలయ పరిసరాల్లోని కృష్ణా నది ప్రవాహంలో పాములు గుంపులు గుంపులుగా సంచరిస్తున్న దృశ్యాలు అందరినీ విస్మయపరుస్తున్నాయి.

కృష్ణా నది ఒడ్డున ఉన్న ఈ పురాతన శివాలయం వద్ద ప్రతి ఏటా కార్తిక మాసంలో పాములు కనిపించడం ఆనవాయతీ అని స్థానికులు చెబుతున్నారు. అయితే, ఈసారి వాటి సంఖ్య వందల్లో ఉండటంతో ఈ విషయం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆలయం వెనుక ఉన్న నదీ ప్రవాహంలో ఈ పాములు స్వేచ్ఛగా తిరుగుతూ కనిపించాయి.

ఇదంతా శివయ్య మహిమేనని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తున్నారు. "ప్రతి కార్తిక మాసంలో స్వామివారిని దర్శించుకోవడానికి ఈ పాములు వస్తాయి. ఈసారి మరింత ఎక్కువ సంఖ్యలో రావడం శివుడి అనుగ్రహానికి నిదర్శనం" అని ఒక భక్తుడు వ్యాఖ్యానించారు. ఈ అద్భుత దృశ్యాలను చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఆలయానికి తరలివస్తున్నారు.

ఈ సంఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో ఈ ఆలయం గురించి రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. భక్తి, ప్రకృతి కలగలిసిన ఈ అసాధారణ దృశ్యం పలువురిని ఆకట్టుకుంటోంది. సాయంత్రం వేళకు మరిన్ని పాములు కనిపించే అవకాశం ఉందని స్థానికులు అంచనా వేస్తున్నారు.
Krishna River
Krishna district
Nagayalanka
Snake video
Karthika Masam
Ramalingeswara Swamy Temple
Lord Shiva
Temple snakes
Viral video
Andhra Pradesh

More Telugu News