Jamal Khashoggi: సారీ చెప్పాలంటూ సౌదీ రాజును డిమాండ్ చేసిన మహిళ.. కారణం ఇదే!

Jamal Khashoggi Wife Demands Apology from Saudi Crown Prince
  • జర్నలిస్ట్ ఖషోగ్గి హత్యలో సౌదీ రాజు పాత్ర ఉందని ఆరోపణలు
  • అమెరికా పర్యటనకు వచ్చిన సౌదీ రాజుపై ఖషోగ్గి భార్య మండిపాటు
  • తనను కలుసుకుని సారీ చెప్పాలని, పరిహారం ఇవ్వాలని డిమాండ్
సౌదీ క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ అమెరికాలో పర్యటిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో సమావేశమై పలు కీలక ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఈ క్రమంలో సౌదీ క్రౌన్ ప్రిన్స్ అమెరికా పర్యటనపై జర్నలిస్ట్ జమాల్ ఖషోగ్గి భార్య హనన్ ఎలాత్ర్ ఖషోగ్గి తీవ్రంగా మండిపడ్డారు. తనను వ్యక్తిగతంగా కలుసుకుని క్షమాపణ చెప్పాలని మహమ్మద్ బిన్ సల్మాన్ ను డిమాండ్ చేశారు. భర్త మరణంతో తాను కోల్పోయిన జీవితానికి పరిహారం ఇవ్వాలన్నారు. ఇందుకు సహకరించాలంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు ఆమె విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు హనన్ ఎలాత్ర్ ఖషోగ్గి ఎక్స్ లో ఓ పోస్టు పెట్టారు.

2018 లో ఇస్తాంబుల్ లోని దౌత్య కార్యాలయం వద్ద జర్నలిస్ట్ జమాల్ ఖషోగ్గి హత్యకు గురయ్యారు. ఈ హత్యకు సౌదీ ఏజెంట్లే కారణమని, సౌదీ క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ ఆదేశాల మేరకే వారు ఈ ఆపరేషన్ నిర్వహించారని ఆరోపణలు వినిపించాయి. అమెరికాకు చెందిన ఖషోగ్గి హత్యకు గురవడంతో సౌదీ, అమెరికాల మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఖషోగ్గి హత్య జరిగిన ఏడేళ్ల తర్వాత తాజాగా సౌదీ క్రౌన్ ప్రిన్స్ అధికారికంగా అమెరికాలో పర్యటిస్తున్నారు. సౌదీతో సత్సంబంధాలు కొనసాగించాలనే ఉద్దేశంతో ట్రంప్ స్వయంగా ఆయనను ఆహ్వానించారు. ఇరు దేశాధినేతల సమావేశంలో పలు కీలక ఒప్పందాలు కుదిరినట్లు వైట్ హౌస్ వర్గాలు వెల్లడించాయి.
Jamal Khashoggi
Saudi Arabia
Mohammed bin Salman
Hanan Elatr Khashoggi
Donald Trump
US Saudi relations
Saudi Crown Prince
Jamal Khashoggi murder
Saudi agents
Istanbul consulate

More Telugu News