Kanpur incident: బలవంతంగా ముద్దు పెట్టబోతే.. నాలుక కొరికేసిన మాజీ ప్రియురాలు

Kanpur Incident Woman Bites Off Ex Lovers Tongue After Assault Attempt
  • లైంగిక వేధింపులకు పాల్పడటంతో నాలుకను కొరికేసిన మహిళ
  • ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఘటన 
  • యువతికి వేరే వ్యక్తితో పెళ్లి కుదరడమే ఘటనకు కారణం
  • నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఒక వ్యక్తి తనపై లైంగిక దాడికి ప్రయత్నించి, బలవంతంగా ముద్దు పెట్టబోయినందుకు ఆ వ్యక్తి నాలుకను ఓ యువతి కొరికేసిన సంఘటన కలకలం రేపింది. పోలీసుల కథనం ప్రకారం చంపి (35) అనే వివాహితుడు అదే ప్రాంతానికి చెందిన ఒక యువతితో గతంలో ప్రేమ వ్యవహారం కొనసాగించాడు. అయితే, ఆ యువతికి ఆమె తల్లిదండ్రులు వేరొకరితో వివాహం నిశ్చయించడంతో అతనికి దూరంగా ఉండటం మొదలు పెట్టింది.

ఈ పరిణామం తట్టుకోలేని చంపి ఆమెను కలుసుకోవడానికి తరచూ ప్రయత్నించాడు. ఈ క్రమంలో ఆమె గ్రామ సమీపంలోని చెరువు వద్దకు ఒంటరిగా వెళ్లడం గమనించాడు. వెంటనే ఆమెను వెంబడించి, అదును చూసి ఆమెను పట్టుకుని లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఆమె ప్రతిఘటించినా వినకుండా బలవంతంగా ముద్దు పెట్టడానికి ప్రయత్నించాడు.

ఆ సమయంలో తీవ్రంగా ప్రతిఘటించిన యువతి అతని నాలుకను బలంగా కొరికేసింది. దాంతో నాలుకలో కొంత భాగం తెగిపోయి తీవ్ర రక్తస్రావం అయింది. చంపి బాధతో గట్టిగా అరవడంతో స్థానికులు అక్కడికి చేరుకున్నారు. అతడిని వెంటనే సమీపంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించగా, మెరుగైన చికిత్స కోసం కాన్పూర్‌లోని మరొక పెద్ద ఆసుపత్రికి రిఫర్ చేశారు.

ఈ ఘటనపై డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ దినేష్ త్రిపాఠి స్పందిస్తూ నిందితుడు చంపిపై కేసు నమోదు చేశామని, తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. 
Kanpur incident
Uttar Pradesh crime
Ex-lover attack
Sexual assault Kanpur
Woman bites tongue
Crime news India
Dinesh Tripathi IPS
Kanpur police
Love affair gone wrong

More Telugu News