Jaishankar: ఉగ్రవాదం నుంచి ప్రజలను రక్షించుకునే హక్కు భారత్‌కు ఉంది: జైశంకర్

Jaishankar India has the right to protect its people from terrorism
  • షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమ్మిట్‌లో జైశంకర్ సందేశం
  • ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా సహించకూడదన్న జైశంకర్
  • ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించకూడదన్న జైశంకర్
భారత ప్రజలను ఉగ్రవాదం నుంచి రక్షించుకునే హక్కు దేశానికి ఉందని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్. జైశంకర్ స్పష్టం చేశారు. రష్యాలో జరిగిన షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమ్మిట్‌లో ఆయన ఉగ్రవాదానికి వ్యతిరేకంగా గట్టిగా మాట్లాడారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా దానిని సహించకూడదని ఆయన అన్నారు.

ఉగ్రవాదం విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్థించే ధోరణి ఉండకూడదని ఆయన తేల్చి చెప్పారు. ఉగ్రవాదాన్ని ఏమాత్రం సహించరాదని స్పష్టం చేశారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడం అనేది ఉమ్మడి ప్రాధాన్యంగా ఉండాలని సూచించారు. ఉగ్రవాదంపై రాజీలేని పోరాటం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

మూడు రోజుల పర్యటనలో భాగంగా జైశంకర్ రష్యాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్‌సీవో సదస్సులో పాల్గొన్నారు. అంతకుముందు రష్యా విదేశాంగ మంత్రి సెర్గి లవ్రోవ్‌తో ఆయన సమావేశమయ్యారు. ఇరువురు ద్వైపాక్షిక, ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై చర్చలు జరిపినట్లు సమాచారం.
Jaishankar
S Jaishankar
SCO Summit
Shanghai Cooperation Organisation
Terrorism

More Telugu News