Raghu Rama Krishna Raju: సొంత ఇల్లు నిర్మాణం కోసం ఇలా చేయండి: రఘురామకృష్ణరాజు

Raghu Rama Krishna Raju Announces Housing Scheme for AP Residents
  • సొంత స్థలంలో ఇల్లు కట్టుకునేవారికి శుభవార్త
  • పీఎం ఆవాస్ యోజన కింద రూ. 2.5 లక్షల ఆర్థిక సాయం
  • గ్రామ, వార్డు సచివాలయాల్లో వివరాల నమోదుకు అవకాశం
  • నవంబర్ 30వ తేదీని తుది గడువుగా నిర్దేశం
  • సీఎం చంద్రబాబు సంకల్పాన్ని నెరవేరుస్తున్నామన్న రఘురామ
సొంత స్థలం లేదా ప్రభుత్వం కేటాయించిన పట్టా స్థలంలో ఇల్లు నిర్మించుకోవాలనుకునే అర్హులైన లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అమలు చేస్తున్న 'ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (PMAY)' పథకం ద్వారా రూ. 2,50,000 ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఒక ప్రకటనలో తెలిపారు.

"ప్రజలందరికీ నా విజ్ఞప్తి. సొంత స్థలములో లేదా ప్రభుత్వం నుంచి పొందిన పట్టా స్థలములో ఇల్లు నిర్మించుకోవాలనుకునే అర్హులైన లబ్ధిదారులకు, కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా 'ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (PMAY)' పథకం ద్వారా రూ.2,50,000/- ఆర్థిక సహాయం అందించడం జరుగుతుంది. అర్హులైన వారు తమ వివరాలను గ్రామ/మున్సిపల్ వార్డు సచివాలయములలో మీ వివరాలు నమోదు చేసుకోవలసిందిగా నా మనవి. 

ప్రతి ఒక్కరికీ సొంత ఇంటి కలను నెరవేర్చాలనే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు సంకల్పానికి మన వంతుగా నవంబర్ 30 వ తేదీ లోపు మీ వివరాలు నమోదు చేసుకోవాలని కోరుతున్నాను" అంటూ రఘురామకృష్ణరాజు సోషల్ మీడియాలో పేర్కొన్నారు. ఈ మేరకు ఓ వీడియో సందేశం విడుదల చేశారు.

Raghu Rama Krishna Raju
PMAY
Pradhan Mantri Awas Yojana
Andhra Pradesh Housing Scheme
AP Housing
Chandrababu Naidu
Housing for All
Home Construction Subsidy
Government Schemes
Affordable Housing

More Telugu News