NTR District: లారీని ఢీకొట్టిన ప్రైవేటు ట్రావెల్స్ బస్సు .. 8 మందికి తీవ్ర గాయాలు

NTR District Private Bus Accident Injures Eight
  • ఎన్టీఆర్ జిల్లా నందిగామ వద్ద ఘటన 
  • హైదరాబాద్ నుంచి విజయవాడ వెళుతున్న బస్సు
  • క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించిన పోలీసులు
  • ఘటన సమయంలో బస్సులో 20 మంది ప్రయాణికులు
ఎన్టీఆర్ జిల్లా నందిగామ సమీపంలో ఈరోజు వేకువజామున రోడ్డు ప్రమాదం సంభవించింది. హైదరాబాద్ నుంచి శ్రీకాకుళం వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి, ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న 11 మంది తీవ్రంగా గాయపడ్డారు.

ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో సుమారు 20 మంది ప్రయాణికులు ఉన్నారు. బస్సు వేగంగా లారీని ఢీకొనడంతో, బస్సు ఎడమవైపు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయింది. ఈ ఘటనతో ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనలకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు.

గాయపడిన వారిని 108 అంబులెన్స్ ద్వారా నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మిగిలిన ప్రయాణికులను మరో వాహనంలో వారి గమ్యస్థానాలకు పంపే ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో నిత్యం ఎక్కడో ఒక చోట బస్సు ప్రమాదాలు జరుగుతుండటం ప్రయాణికులను ఆందోళనకు గురిచేస్తోంది. 
NTR District
Nandigama
Road Accident
Private Travels Bus
Bus Accident
lorry
Srikakulam
Hyderabad
Andhra Pradesh
Accident Injuries

More Telugu News