VV Lakshminarayana: చంద్రబాబు, లోకేశ్ లకు కంగ్రాట్స్ చెప్పిన మాజీ జేడీ లక్ష్మీనారాయణ

VV Lakshminarayana Congratulates Chandrababu and Lokesh
  • ఏపీ ప్రభుత్వానికి సీబీఐ మాజీ జేడీ కీలక సూచనలు
  • విశాఖ సదస్సుపై ప్రశంసలు, ఒప్పందాల అమలుపై సలహాలు
  • ఒప్పందాలు కార్యరూపం దాల్చాలంటే ఇవే ముఖ్యం
  • ప్రభుత్వానికి మూడు కీలక సూత్రాలు చెప్పిన లక్ష్మీనారాయణ
విశాఖలో సీఐఐ పెట్టుబడుల సదస్సు విజయవంతం కావడంపై ప్రభుత్వానికి సీబీఐ మాజీ జేడీ, జై భారత్ నేషనల్ పార్టీ అధినేత వీవీ లక్ష్మీనారాయణ అభినందనలు తెలిపారు. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్, సుచిత్రా ఎల్లాను ట్యాగ్ చేస్తూ ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఒప్పందాలు చేసుకోవడం ఒక ఎత్తయితే, వాటిని క్షేత్రస్థాయిలో కార్యరూపం దాల్చేలా చూడటమే తర్వాతి కీలకమైన అడుగు అని ఆయన అభిప్రాయపడ్డారు.

ఒప్పందాలు (MoUs) నిజమైన ఉద్యోగాలు, అభివృద్ధిగా మారాలంటే ప్రభుత్వం మూడు అంశాలపై ప్రధానంగా దృష్టి సారించాలని లక్ష్మీనారాయణ సూచించారు. ఆయన సూచించిన కీలక అంశాలు:

* నిజంగా సమర్థవంతంగా పనిచేసే సింగిల్ విండో క్లియరెన్స్ వ్యవస్థను ఏర్పాటు చేయాలి.
* భూ వివాదాలకు సంబంధించిన కేసులను వేగంగా పరిష్కరించాలి.
* పర్యావరణ అనుమతులను సకాలంలో, వేగంగా మంజూరు చేయాలి.

ఈ మూడు అంశాలను అత్యంత ప్రాధాన్యతగా తీసుకుని ముందుకు సాగితేనే కుదుర్చుకున్న ఒప్పందాలు పరిశ్రమలుగా మారి, రాష్ట్రంలో యువతకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని, ఆర్థిక వృద్ధి సాధ్యమవుతుందని వీవీ లక్ష్మీనారాయణ తన పోస్టులో పేర్కొన్నారు. 
VV Lakshminarayana
Chandrababu Naidu
Nara Lokesh
CII Summit Vizag
Andhra Pradesh Investments
Jai Bharat National Party
AP Economic Growth
Single Window Clearance
Land Disputes
Environmental Clearances

More Telugu News