Divya: మలేసియా వెళ్లినట్లు మూడేళ్ల నాటకం.. కన్నవారిని మోసం చేసి ప్రాణాలు తీసుకున్న యువతి

Divya faked Malaysia trip for 3 years dies by suicide in Madurai
  • మూడేళ్లుగా తల్లిదండ్రులను నమ్మిస్తూ డబ్బులు వసూలు
  • మదురైలోనే ప్రియుడిని రహస్యంగా పెళ్లి చేసుకున్న వైనం
  • భర్తతో గొడవపడి ఉరేసుకుని ఆత్మహత్యాయత్నం
  • ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయిన యువతి
  • భర్తను అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పోలీసులు
ఉన్నత చదువుల కోసం మలేసియా వెళ్తున్నానని తల్లిదండ్రులను నమ్మించిన ఓ యువతి, స్థానికంగానే ప్రియుడిని పెళ్లి చేసుకొని.. చివరకు అతనితో గొడవల కారణంగా ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన మదురైలో వెలుగుచూసింది. మూడేళ్లుగా తమ కుమార్తె విదేశాల్లో చదువుకుంటోందని భావిస్తున్న ఆ తల్లిదండ్రులకు, ఆమె ఆత్మహత్య చేసుకుందని తెలియడంతో కన్నీరుమున్నీరయ్యారు.
 
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. మదురై అనుప్పానడి ప్రాంతానికి చెందిన ధర్మరాజ్‌కు ఐదుగురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ఆయన ఐదో కుమార్తె దివ్య (28) మూడేళ్ల క్రితం మలేసియాలో ఎంఎస్సీ చదువుతానని ఇంట్లో చెప్పింది. ఇందుకోసం రూ.5 లక్షలు ఖర్చవుతుందని చెప్పడంతో, కుటుంబసభ్యులు ఆమెకు పెద్ద మొత్తంలో డబ్బు ఇచ్చి పంపించారు. అప్పటి నుంచి దివ్య మలేసియాలోనే ఉందని భావిస్తూ ప్రతినెలా ఖర్చులకు డబ్బులు పంపుతున్నారు.
 
అయితే, ఇటీవల ప్రకాష్ అనే వ్యక్తి ధర్మరాజ్‌కు ఫోన్ చేసి, దివ్య మలేసియా వెళ్లలేదని, తనను పెళ్లి చేసుకొని మదురైలోనే ఉంటోందని చెప్పడంతో కుటుంబం దిగ్భ్రాంతికి గురైంది. తమకు రెండేళ్ల కుమార్తె కూడా ఉందని, కుటుంబ కలహాల కారణంగా దివ్య ఉరేసుకుని ఆత్మహత్యకు యత్నించగా, తాను మాట్టుత్తావనిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించానని తెలిపాడు.
 
ధర్మరాజ్‌ ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు.. ప్రకాష్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. దివ్య, ప్రకాష్ తిరుప్పరకుండ్రంలో నివసిస్తున్నట్లు గుర్తించారు. భార్యాభర్తల మధ్య గొడవల కారణంగానే దివ్య ఆత్మహత్యకు యత్నించిందని, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె మృతిచెందిందని పోలీసులు ధ్రువీకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Divya
Madurai
Suicide
Malaysia
Love affair
Family dispute
Tamil Nadu
প্রতারণা
আর্থিক প্রতারণা
আত্মহনন

More Telugu News