Mahesh Babu: మహేశ్ బాబు, రాజమౌళి సినిమా పేరు ఖరారు.. 'వారణాసి'
- యాక్షన్ అడ్వెంచర్ సినిమాకు టైటిల్ ఖరారు
- ఆర్ఎఫ్‌సీలో జరిగిన కార్యక్రమంలో టైటిల్ పరిచయం
- సినిమాలో రుద్రగా ప్రేక్షకులకు కనువిందు చేయనున్న మహేశ్ బాబు
సూపర్‌స్టార్ మహేశ్ బాబు, ప్రముఖ దర్శకుడు రాజమౌళి కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రానికి సంబంధించిన మరొక అప్‌డేట్ వచ్చింది. ఈ యాక్షన్ అడ్వెంచర్ చిత్రానికి 'వారణాసి' అనే పేరును ఖరారు చేశారు.
ఈ మేరకు, శనివారం హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగిన కార్యక్రమంలో ఈ టైటిల్‌ను పరిచయం చేశారు. ఈ చిత్రంలో మహేశ్ బాబు రుద్ర అనే పాత్రలో కనిపించనున్నారు.
ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ వంటి ప్రముఖ తారలు ఈ చిత్రంలో నటిస్తున్నారు. ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని దుర్గా ఆర్ట్స్ పతాకంపై కేఎల్ నారాయణ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన మహేశ్ బాబు ఫస్ట్ లుక్ విశేషంగా ఆకట్టుకుంది. నందిపై కూర్చుని, చేతిలో త్రిశూలంతో, మెడలో నంది లాకెట్ ధరించి ఆయన స్వారీ చేస్తున్నట్లుగా ఈ చిత్రం ఉంది.