ACB Raids: తెలంగాణలోని పలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఏసీబీ సోదాలు

ACB Raids on Sub Registrar Offices in Telangana
  • తనిఖీల్లో రూ. 2.51 లక్షలు లెక్కలు చూపని నగదు స్వాధీనం
  • 29 రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు ప్రజలకు చేరకుండా కార్యాలయాల్లో ఉంచుకున్న అధికారులు
  • పలు కార్యాలయాల్లో పనిచేయని సీసీటీవీ కెమెరాలు
తెలంగాణ రాష్ట్రంలోని పలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఏసీబీ అధికారులు శనివారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. తనిఖీలలో సుమారు రూ. 2.51 లక్షలు మేర లెక్కల్లో చూపని నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా, 289 రిజిస్ట్రేషన్ పత్రాలు ప్రజలకు చేరకుండా కార్యాలయాల్లోనే ఉండిపోయినట్లు గుర్తించారు.

అధికారుల అనుమతి లేకుండానే 19 మంది ప్రైవేటు వ్యక్తులు, అలాగే 60 మంది డాక్యుమెంట్ రైటర్లు కార్యాలయాల్లో సంచరిస్తున్నట్లు గుర్తించారు. పలు కార్యాలయాల్లో సీసీటీవీ కెమెరాలు పనిచేయడం లేదని కూడా అధికారులు గుర్తించారు. ఈ సందర్భంగా 13 మంది సబ్ రిజిస్ట్రార్ అధికారుల నివాసాల్లో కూడా ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. వారి ఇళ్లలో పెద్ద మొత్తంలో నగదు, బంగారు ఆభరణాలు, ఆస్తి పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.
ACB Raids
Telangana
Sub Registrar Offices
Corruption
Cash Seized
Property Documents

More Telugu News