KTR: అండగా ఉంటాం: మాగంటి సునీత కుటుంబానికి కేటీఆర్ భరోసా
- జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత ఇంటికి వెళ్లిన కేటీఆర్
- ఉప ఎన్నిక ఓటమి నేపథ్యంలో కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పిన వైనం
- రాజకీయాల్లో గెలుపోటములు చాలా సాధారణమని వ్యాఖ్య
రాజకీయాల్లో గెలుపోటములు సహజమని, ఓటమికి అధైర్యపడొద్దని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందిన మాగంటి సునీత గోపీనాథ్ నివాసానికి ఆయన వెళ్లారు. ఈ సందర్భంగా సునీతతో పాటు వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో అధికార కాంగ్రెస్ పార్టీ అనేక దౌర్జన్యాలకు, అక్రమాలకు పాల్పడిందని కేటీఆర్ ఆరోపించారు. అయినప్పటికీ, వాటన్నింటినీ ఎదుర్కొని సునీత, ఆమె పిల్లలు ఎంతో స్ఫూర్తితో పోరాడారని అభినందించారు. ఎన్నికల్లో గట్టి పోటీ ఇచ్చి, గొప్ప పోరాట పటిమను ప్రదర్శించారని కొనియాడారు.
ఈ క్లిష్ట సమయంలో పార్టీ సునీత కుటుంబానికి అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని కేటీఆర్ స్పష్టం చేశారు. రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి ఆందోళన చెందవద్దని, పార్టీ అండదండలు ఎల్లప్పుడూ ఉంటాయని ఆయన భరోసా ఇచ్చారు.