Shyamala: అభివృద్ధి చేసింది ఎవరు? అధోగతి పాలుచేస్తున్నది ఎవరు? మీరే గమనించండి: యాంకర్ శ్యామల

Anchor Shyamala Criticizes Coalition Government on Development
  • కూటమి ప్రభుత్వంపై వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల విమర్శలు
  • జగన్ హయాంలో విద్య, వైద్యానికి పెద్దపీట వేశామని వెల్లడి
  • ప్రస్తుత ప్రభుత్వం విద్య, వైద్యాన్ని పేదలకు దూరం చేస్తోందని విమర్శ
కూటమి ప్రభుత్వంపై వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి యాంకర్ శ్యామల తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. గతంలో తమ అధినేత జగన్మోహన్ రెడ్డి విశాఖను బెంగుళూరు, చెన్నై, హైదరాబాద్‌తో పోటీపడే నగరంగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నారని గుర్తుచేశారు. కానీ కూటమి నేతలు అధోగతి పాలుచేస్తున్నారని వ్యాఖ్యానించారు.

"బెంగుళూరు, చెన్నై, హైదరాబాద్ తో పోటీపడే విధంగా విశాఖ నగరాన్ని అభివృద్ధి చేస్తానని జగన్ గారు చెప్పారు. పిల్లలకు మనం ఇచ్చే నిజమైన ఆస్తి విద్య మాత్రమే... అని భావించి, విద్యారంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారు. విద్య , వైద్యం పేద మధ్యతరగతి ప్రజలకు అందించడమే లక్ష్యంగా పనిచేశారు.

కట్ చేస్తే.. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఒకవైపు కల్తీ మద్యాన్ని విస్తరించి, విద్య, వైద్యాన్ని పేద మధ్యతరగతి ప్రజలకు దూరం చేశారు. దీనికి తోడుగా విశాఖ బీచ్ లో భార్యాభర్తలు రెండు పెగ్గులు వేసుకునే సౌకర్యాన్ని కల్పించి , గోవాతో పోటీ పడే విధంగా విశాఖ బీచ్ ఉండాలని అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు అంటున్నారు! రాష్ట్రాన్ని అభివృద్ధి చేసింది ఎవరు? అధోగతి పాలు చేస్తున్నది ఎవరు? మీరే గమనించండి!" అంటూ శ్యామల సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
Shyamala
YSRCP
Andhra Pradesh Politics
Visakhapatnam
Jagan Mohan Reddy
TDP
CBN
развитии
политике

More Telugu News