Kendriya Vidyalaya Sangathan: కేంద్రీయ, నవోదయ విద్యాలయాల్లో భారీగా నియామకాలు.. 15 వేల పోస్టులకు నోటిఫికేషన్

KVS NVS Recruitment Notification Released for 15000 Posts
  • ఇప్పటికే ప్రారంభమైన దరఖాస్తులు.. డిసెంబర్ 4 తో ముగియనున్న గడువు
  • టీచింగ్, నాన్ టీచింగ్ విభాగాల్లో ఖాళీలు
  • రెండంచెల రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక
దేశవ్యాప్తంగా కేంద్రీయ విద్యాలయ సంఘటన్ (కేవీఎస్), నవోదయ విద్యాలయ సమితి(ఎన్వీఎస్)లలో ఖాళీగా ఉన్న దాదాపు 15 వేల పోస్టుల భర్తీకి సీబీఎస్ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది. టీచింగ్, నాన్ – టీచింగ్ పోస్టుల భర్తీకి ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఈ నెల 14 నుంచే ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకునే వీలు కల్పించింది. దరఖాస్తులకు తుది గడువు డిసెంబర్ 4 గా పేర్కొంది. అసిస్టెంట్ కమిషనర్, ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ (పీజీటీఎస్), ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ సహా లైబ్రేరియన్ వంటి నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలిపింది. కేంద్రీయ విద్యాలయ సంఘటన్ లో 9,126 పోస్టులు, నవోదయ విద్యాలయ సమితిలో మొత్తం 5,841 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు పేర్కొంది.

అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి పీజీ, బి.ఎడ్, బి.లైబ్రరీ సైన్స్, ఎం.కాం, బి.కాం, బి.టెక్/ బీఈ, ఏదైనా డిగ్రీ.. పోస్టులకు అనుగుణంగా అర్హతల్లో మార్పులు ఉంటాయి. పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ లో పేర్కొన్నట్లు తెలిపింది.

వయోపరిమితి: 18 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాలు (పోస్టును బట్టి మార్పులు)‌‌. నిబంధనల మేరకు రిజర్వేషన్ల ప్రకారం సడలింపు ఉంటుంది.

ఎంపిక విధానం: రెండంచెల రాత పరీక్ష, ఆ తర్వాత ఇంటర్వ్యూ, స్టెనోగ్రాఫర్ పోస్టుకు స్కిల్ టెస్ట్ నిర్వహిస్తారు.
Kendriya Vidyalaya Sangathan
KVS Recruitment 2025
Navodaya Vidyalaya Samiti
NVS Recruitment
Teaching Jobs
Non-Teaching Jobs
CBSE Notification
Government Jobs
Central Government Jobs
Recruitment Notification

More Telugu News