Telangana Transport Department: ఫ్యాన్సీ నెంబర్ల వేలంతో రవాణాశాఖకు రూ. 65 లక్షల ఆదాయం

Telangana Transport Department Earns 65 Lakhs in Fancy Number Auction
  • రవాణా శాఖ కార్యాలయానికి రూ.65,38,889ల ఆదాయం 
  • టీజీ09హెచ్ 9999 నెంబర్‌కు రూ. 22 లక్షల ఆదాయం
  • టీజీ09జే 0003 నెంబర్‌కు వచ్చిన రూ.1,15,121 ఆదాయం
ఫ్యాన్సీ నెంబర్ల వేలం ద్వారా తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖకు భారీ ఆదాయం సమకూరింది. ఒక్కరోజులో ఖైరతాబాద్ రవాణా శాఖ కార్యాలయానికి రూ.65,38,889ల ఆదాయం వచ్చిందని హైదరాబాద్ జాయింట్ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ రమేశ్ తెలిపారు. వివిధ ఫ్యాన్సీ నెంబర్లను పలువురు ప్రముఖులు దక్కించుకున్నట్లు ఆయన వెల్లడించారు.

అత్యధికంగా టీజీ09హెచ్ 9999 నెంబర్‌కు రూ. 22,72,222లు పలికింది. అతితక్కువగా టీజీ09జే 0003 నెంబరుకు రూ. 1,15,121 ఆదాయం వచ్చింది.

టీజీ09హెచ్ 9999 నెంబర్‌ను రూ. 22,72,222లకు హానర్ ప్రైమ్ హౌసింగ్ ఎల్ఎల్‌పీ అధినేతలు దక్కించుకున్నారు. టీజీ09జే 0009 నెంబర్‌ను రూ.6,80,000లకు మెస్సర్స్ దండు ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం, టీజీ09జే 0006 నెంబర్‌ను రూ.5,70,666లకు సాయి సిల్క్స్ కళామందిర్ లిమిటెడ్ యాజమాన్యం, టీజీ09జే 0099 నెంబర్‌ను రూ. 3,40,000లకు మెస్సర్స్ గోదావరి ఫార్చూన్ సంస్థ, టీజీ09జే 0001 నెంబర్‌ను రూ. 2,60,000లకు శ్రీనిధి ఐటీ స్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ దక్కించుకున్నాయి.

టీజీ09జే 0005 నెంబర్‌‍‌‌ను రూ.2,40,100లకు నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ, టీజీ09జే 0018 నెంబర్‌ను రూ.1,71,189లకు రోహిత్ రెడ్డి ముత్తు, టీజీ09జే 0007 నెంబర్‌ను రూ.1,69,002లకు కొండవరపు శ్రీనివాస్ నాయుడు, టీజీ09జే 0077 నెంబర్‌ను రూ.1,41,789లకు మీనాక్షి పవర్ ప్రైవేట్ లిమిటెడ్, టీజీ09జే 0123 నెంబర్‌ను రూ.1,19,999లకు ఆకుల మాధురి, టీజీ09జే 0003 నెంబర్‌ను రూ.1,15,121లకు జీఎస్.ఆర్ కన్‌స్ట్రక్షన్స్ సంస్థ కైవసం చేసుకుంది.
Telangana Transport Department
Fancy number auction
Khairatabad RTA

More Telugu News