Pawan Kalyan: బీహార్ ఎన్నికల ఫలితాలపై పవన్ కల్యాణ్ స్పందన

Pawan Kalyan Reacts to Bihar Election Results
  • ఎన్డీఏ కూటమికి శుభాకాంక్షలు తెలిపిన పవన్ కల్యాణ్
  • మోదీ, నితీశ్‌పై ప్రజల నమ్మకానికి నిదర్శనమన్న పవన్
  • మోదీకి పెరుగుతున్న ప్రజాదరణకు ఇది సంకేతమన్న సత్యకుమార్
దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏ కూటమి విజయం దిశగా దూసుకెళుతుండటంపై ఆంధ్రప్రదేశ్ నుంచి స్పందనలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఎన్డీఏ కూటమికి అభినందనలు తెలుపుతూ, ఇది ప్రధాని మోదీ నాయకత్వానికి లభించిన మద్దతుగా అభివర్ణించారు.

పవన్ కల్యాణ్ స్పందిస్తూ... బీహార్ ప్రజలు ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ నాయకత్వంపై మరోసారి తమ విశ్వాసాన్ని చాటారని అన్నారు. అభివృద్ధి, పారదర్శక పాలనకే ప్రజలు పట్టం కట్టారని, ఈ అపూర్వ తీర్పు దేశం ఎలాంటి పాలన కోరుకుంటోందో స్పష్టం చేస్తోందని పేర్కొన్నారు. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలన్నింటికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు.

మరోవైపు, మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ.. ఈ ఫలితాలు దేశ రాజకీయ గతిని సూచిస్తున్నాయని తెలిపారు. ప్రధాని మోదీ అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలకు ప్రజలు బలమైన మద్దతు ప్రకటించారని వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్‌లో మాదిరిగానే బీహార్‌లోనూ 'డబుల్ ఇంజిన్' ప్రభుత్వానికి ప్రజలు ఓటు వేశారని ఆయన గుర్తుచేశారు. 
Pawan Kalyan
Bihar Elections
NDA Victory
Narendra Modi
Nitish Kumar
Satyakumar Yadav
Andhra Pradesh
Political Analysis
Election Results
Double Engine Government

More Telugu News