Naveen Yadav: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక... రౌండో రౌండ్ లో కూడా కాంగ్రెస్ జోరు
- ముగిసిన రెండో రౌండ్ ఓట్ల లెక్కింపు
- 1,144 ఓట్ల ఆధిక్యతలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్
- రెండో రౌండ్ వరకు కాంగ్రెస్ కు వచ్చిన ఓట్లు 18,617
జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ఉత్కంఠభరితంగా సాగుతోంది. తొలి రౌండ్‌లో నువ్వా నేనా అన్నట్లు సాగగా... రెండో రౌండ్ ముగిసేసరికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆధిక్యాన్ని ప్రదర్శించారు. రెండు రౌండ్లు కలిపి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ 1,144 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
వివరాల్లోకి వెళితే, రెండో రౌండ్ ఓట్ల లెక్కింపులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు 18,617 ఓట్లు రాగా, బీఆర్ఎస్ అభ్యర్థికి 17,473 ఓట్లు పోలయ్యాయి. ఇదే రౌండ్‌లో బీజేపీ అభ్యర్థికి 2,167 ఓట్లు దక్కాయి. దీంతో రెండు రౌండ్లు ముగిసేసరికి కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యంలోకి వచ్చింది.
ఇదిలా ఉండగా, కౌంటింగ్ కేంద్రం వద్ద గందరగోళ వాతావరణం నెలకొంది. ఓట్ల లెక్కింపు ఫలితాలను ఎప్పటికప్పుడు అధికారికంగా వెల్లడించడం లేదని ఆరోపిస్తూ మీడియా ప్రతినిధులు నిరసనకు దిగారు. ఫలితాల వెల్లడిలో జాప్యంపై వారు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విషయంపై మీడియా ప్రతినిధులు ఎన్నికల కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు.