01 Thu 19:34 సికింద్రాబాద్ నియోజకవర్గ విద్యార్థులకు.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక ప్రకటన సికింద్రాబాద్ నియోజకవర్గంలోని పదో తరగతి విద్యార్థులందరికీ పరీక్ష ఫీజు చెల్లిస్తానని వెల్లడి ఫీజును తన వేతనం నుంచి చెల్లిస్తానన్న కిషన్ రెడ్డి ఈ మేరకు హైదరాబాద్ జిల్లా కలెక్టర్‌కు లేఖ రాసిన కిషన్ రెడ్డి
02 Fri 20:08 ఏపీలో స్మార్ట్ సిటీలు.. రష్యాలో మంత్రి లోకేష్ కీలక భేటీ సెయింట్ పీటర్స్‌బర్గ్ ప్రభుత్వ అధికారితో మంత్రి లోకేష్ భేటీ సేఫ్ అండ్ స్మార్ట్ సిటీల ఏర్పాటుపై కీలక చర్చలు డిజిటల్ విద్య, మౌలిక సదుపాయాలపై ప్రధానంగా దృష్టి ఉమ్మడి వర్కింగ్ గ్రూప్ ఏర్పాటుకు ఇరుపక్షాల నిర్ణయం
03 Fri 20:00 మా పాలనలో పేపర్ లీక్ కాలేదు.. తెలంగాణలో నిషేధానికి గురైన కంపెనీకి కాంట్రాక్ట్ ఇచ్చారు: కేజ్రీవాల్ కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక లీకులు పెరిగాయని ఆరోపణ వేల కోట్ల వ్యాపారంగా మారిన పేపర్ లీకుల వెనుక పెద్ద మాఫియా ఉందని వ్యాఖ్య లీక్‌లపై దేశవ్యాప్తంగా విద్యార్థులు, యువత నిరసనలు చేయాలని పిలుపు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు డిమాండ్
04 Fri 19:36 జనసేన పార్టీ రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్... పవన్ కల్యాణ్ ప్రకటన జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ అధికారికంగా ఖరారు చేసిన పవన్ కల్యాణ్ శనివారం మధ్యాహ్నం నామినేషన్ దాఖలు చేయనున్న రమేష్ కష్టకాలంలో నిలిచినందుకే పదవి అన్న జనసేన 2015 నుంచి పవన్ వెన్నంటి ఉన్న లింగమనేని రమేష్
05 Fri 19:22 డీఎస్సీపై ప్రభుత్వం ఫుల్ క్లారిటీ.. హారిజాంటల్ రిజర్వేషన్‌పై సుదీర్ఘ వివరణ డీఎస్సీ నియామకాల్లో హారిజాంటల్ రిజర్వేషన్ పై ప్రభుత్వ సమగ్ర వివరణ జీవో 77 ప్రకారమే పోస్టుల భర్తీ, సుప్రీంకోర్టు ఆదేశాల అమలు అని వెల్లడి వర్టికల్, హారిజాంటల్ రిజర్వేషన్ల మధ్య తేడాను ఉదాహరణలతో స్పష్టం చేసిన అధికారులు స్పోర్ట్స్ కోటా, దివ్యాంగుల కోటా ఎంపికలు నిబంధనల ప్రకారమే జరిగాయని వెల్లడి కాల్ లెటర్ వస్తే ఉద్యోగం వచ్చినట్లు కాదు, అది కేవలం సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కోసమేనని స్పష్టీకరణ
06 Fri 19:01 యుద్ధానికి ముగింపు పలుకుదాం.. పుతిన్‌కు జెలెన్‌స్కీ బహిరంగ లేఖ యుద్ధాన్ని ముగించేందుకు నేరుగా చర్చలు జరపాలని ప్రతిపాదన లేఖను పుతిన్ చదివారని వెల్లడించిన క్రెమ్లిన్ ప్రతినిధి పెస్కోవ్ చర్చలకు తాము సిద్ధంగానే ఉన్నామని రష్యా ప్రకటన స్విట్జర్లాండ్, టర్కీ వంటి దేశాల్లో భేటీకి జెలెన్‌స్కీ సూచన
07 Fri 18:59 మీ వైఫల్యాలను కేంద్రంపై నెట్టడం సరికాదు: రేవంత్ రెడ్డిపై ధర్మపురి అర్వింద్ ఫైర్ తెలంగాణలో దుమారం రేపుతున్న ధాన్యం కొనుగోళ్ల వ్యవహారం రైతుల ధాన్యం తరలించడానికి లారీలు దొరకడం లేదా అని అర్వింద్ ఫైర్ సీఎం కేవలం విమర్శలకే పరిమితం అయ్యారని విమర్శ
08 Fri 18:36 భూమిపై జీవం పుట్టుక: పాత సిద్ధాంతాన్ని మార్చేసిన కొత్త పరిశోధన! భూమిపై జీవానికి మూలంపై కొత్త సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన నాసా భాస్వరం, నత్రజని బయటి గ్రహశకలాల నుంచి రాలేదని వెల్లడి సూర్యుడికి దగ్గరగా ఉన్న వస్తువుల నుంచే ఇవి భూమికి చేరాయని నిర్ధారణ బయటి పదార్థాలను భూమి వైపు రాకుండా గురు గ్రహం అడ్డుకుందని గుర్తింపు ఇతర గ్రహాలపై జీవం అన్వేషణకు ఈ పరిశోధన కీలకం కానుంది
09 Fri 18:35 ట్రోల్స్ పట్టించుకోను: నిధి అగర్వాల్ వరుసగా పరాజయం పాలవుతున్న నిధి నటించిన సినిమాలు ఐరన్ లెగ్ అంటూ ట్రోల్ చేస్తున్న నెటిజన్లు తాను టాలెంట్ ను మాత్రమే నమ్ముకుంటానన్న నిధి
10 Fri 18:25 ఐపీఎల్ 2026 ఫైనల్ తర్వాత... ట్రక్కు కిందకు దూసుకెళ్లిన కారు.. ప్రాణాలతో బయటపడ్డ ఆసీస్ మాజీ కెప్టెన్ ఐపీఎల్ ఫైనల్ తర్వాత కారు ప్రమాదానికి గురైన మైఖేల్ క్లార్క్ ట్రక్కు కిందకు దూసుకెళ్లిన కారు.. స్వల్ప గాయాలతో బయటపడ్డ క్లార్క్ నిద్రలో ఉండగా ప్రమాదం జరిగిందని వెల్లడి సహాయం చేసిన భారతీయులకు, బీసీసీఐకి కృతజ్ఞతలు తెలిపిన క్లార్క్