Naresh: పెళ్లి సంబంధాలు కుదరట్లేదని మనస్తాపం.. యువకుడి బలవన్మరణం

Naresh Commits Suicide Due to Delay in Marriage
  • హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలానికి చెందిన నరేశ్  
  • హైదరాబాద్‌లోని ఘట్‌కేసర్ వద్ద రైలు కిందపడి బలవన్మరణం
  • బట్టల షాపులో పనిచేస్తుండటంతో సంబంధాలు కుదరలేదని ఆవేదన
  • నాలుగేళ్లుగా పెళ్లి ప్రయత్నాలు విఫలం కావడంతో తీవ్ర నిర్ణయం
హైదరాబాద్‌లో ఓ యువకుడు తీవ్ర నిర్ణయం తీసుకున్నాడు. మూడు పదుల వయసు దాటినా పెళ్లి కావడం లేదన్న మనస్తాపంతో రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాద ఘటన ఘట్‌కేసర్ రైల్వే స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలానికి చెందిన బూర సురేందర్, రమ దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. పెద్ద కుమారుడైన నరేశ్ (32) హైదరాబాద్‌లోని అమీర్‌పేటలో ఓ బట్టల దుకాణంలో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. కుమార్తెకు వివాహం కాగా, నరేశ్‌కు గత నాలుగేళ్లుగా కుటుంబసభ్యులు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు.

అయితే, నరేశ్ ఓ బట్టల షాపులో పనిచేస్తున్నాడనే కారణంతో పిల్లను ఇచ్చేందుకు ఎవరూ ముందుకు రాలేదని కుటుంబసభ్యులు చెబుతున్నారు. ఎన్ని సంబంధాలు చూసినా కుదరకపోవడంతో నరేశ్ తీవ్ర మస్తాపానికి గురయ్యాడు.

ఈ క్రమంలో జీవితంపై విరక్తి చెందిన నరేశ్, మంగళవారం మధ్యాహ్నం ఘట్‌కేసర్‌లోని మాధవరెడ్డి ఫ్లై ఓవర్ సమీపంలో గోల్కొండ ఎక్స్‌ప్రెస్ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబసభ్యులు తెలిపారు. 
Naresh
Hyderabad
Ghatkesar
Marriage proposals
Suicide
Hanumakonda
Golconda Express
Ammerpet
Job prospects
Telangana

More Telugu News