Thota Tharani: ఆర్ట్ డైరెక్టర్ తోట తరణికి శుభాకాంక్షలు తెలిపిన పవన్ కల్యాణ్

Pawan Kalyan Congratulates Art Director Thota Tharani
  • ప్రముఖ కళా దర్శకుడు తోట తరణికి ఫ్రాన్స్ ప్రభుత్వ పురస్కారం
  • సహజత్వం ఉట్టిపడేలా సెట్స్ వేయడం ఆయన ప్రత్యేకత అన్న పవన్ కల్యాణ్
  • ‘హరిహర వీరమల్లు’ చిత్రానికి తోట తరణి పనిచేశారని గుర్తు చేసుకున్న పవన్
  • ఆయన సృజనాత్మకత యువతరానికి ఆదర్శమన్న పవన్
ప్రముఖ కళా దర్శకుడు, పద్మశ్రీ తోట తరణికి ఫ్రాన్స్ ప్రభుత్వ అత్యున్నత పురస్కారం "చెవాలియర్‌ డె లా లీజియన్‌ డి హానర్" లభించడం పట్ల ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ విశిష్ట గౌరవం అందుకున్న తోట తరణికి ఆయన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.
 
ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ..“భారత చిత్ర పరిశ్రమ గర్వించదగ్గ అత్యుత్తమ కళా దర్శకులలో తోట తరణి గారు ముందు వరుసలో ఉంటారు. కథాంశం ఏదైనా సరే, సహజత్వం ఉట్టిపడేలా సెట్స్‌ను రూపొందించడం ఆయనకే చెల్లింది,” అని ప్రశంసించారు. సామాజిక, చారిత్రక, పౌరాణికం అనే తేడా లేకుండా ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేసి, అద్భుతమైన డ్రాయింగ్స్‌తో సృజనాత్మక సెట్స్‌ను ఆయన తీర్చిదిద్దుతారని కొనియాడారు.
 
తాను నటిస్తున్న ‘హరిహర వీరమల్లు’ చిత్రానికి తోట తరణి కళా దర్శకత్వం వహిస్తున్న విషయాన్ని పవన్ కల్యాణ్ గుర్తు చేసుకున్నారు. ఆయన అపారమైన సృజనాత్మకత, పని పట్ల నిబద్ధత భవిష్యత్ తరాలకు గొప్ప స్ఫూర్తినిస్తాయని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా తోట తరణి సంపూర్ణ ఆరోగ్యంతో, సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నట్లు తన సందేశంలో పేర్కొన్నారు.
Thota Tharani
Pawan Kalyan
Chevalier de l'Ordre des Arts et des Lettres
Hari Hara Veera Mallu
Art Director
France Award
Indian Cinema
Movie Sets
Andhra Pradesh

More Telugu News