Elkathurthy Chicken Farm: పాలాల్లో దొరికిన వేలాది కోళ్లు.. విచారణలో వెలుగులోకి కొత్త కోణం!

Elkathurthy Chicken Farm owner releases chickens for insurance money
  • ఎల్కతుర్తి-సిద్దిపేట జాతీయ రహదారి పక్కన పొలాల్లో దొరికిన వేలాది నాటుకోళ్లు
  • నాలుగు రోజుల క్రితం ఈ కోళ్లను యజమాని ఉద్దేశపూర్వకంగా వదిలినట్లు గుర్తించిన పోలీసులు
  • బీమా డబ్బుల కోసం యజమాని కోళ్లను వదిలాడని పోలీసుల నిర్ధారణ
హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి-సిద్దిపేట జాతీయ రహదారిపై నాలుగు రోజుల క్రితం వేలాది నాటుకోళ్లు కనిపించిన విషయం విదితమే. ఎల్కతుర్తి మండల కేంద్రంలోని పొలాల్లో 2,000కు పైగా కోళ్లు ఒక్కసారిగా ప్రత్యక్షం కావడంతో కలకలం రేగింది. కోళ్లు పొలాల్లో తిరుగుతుండడంతో చాలామంది వాటిని పట్టుకుపోయారు. అయితే, ఈ కోళ్లు అక్కడ కనిపించడానికి కోళ్ల ఫారమ్ యజమాని కారణమని పోలీసుల విచారణలో తేలింది.

బీమా సొమ్ము కోసమే కోళ్ల ఫారమ్ యజమాని నాటుకోళ్లను వదిలినట్లు పోలీసులు నిర్ధారించారు. గుర్తుతెలియని వ్యక్తులు కోళ్లను వదిలి వెళ్లారని కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేశారు. స్థానికులంతా రోడ్డు మీద దొరికిన కోళ్లను తీసుకువెళ్లడంతో, అవి ఎక్కడి నుంచి వచ్చాయో తెలియని పరిస్థితుల్లో వైద్య శాఖ అధికారులు కూడా హెచ్చరికలు జారీ చేశారు. ఆ కోళ్లను తినవద్దని ఆదేశాలు జారీ చేశారు. పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీనికి యజమాని కారణమని తేలింది.
Elkathurthy Chicken Farm
Elkathurthy
Chicken Farm
Insurance Fraud
Hanamkonda
Siddipet

More Telugu News