KTR: డీజీపీకి కేటీఆర్ క్షమాపణ చెప్పాలి: పోలీసు అధికారుల సంఘం డిమాండ్

KTR Should Apologize to DGP Demands Police Officers Association
  • డీజీపీపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు సరికాదన్న పోలీసు అధికారుల సంఘం
  • పోలీసు శాఖ నిష్పక్షపాతంగా పని చేస్తోందని వెల్లడి
  • సంస్కారయుతంగా, సభ్యతతో ప్రశ్నించాలని సూచన
తెలంగాణ రాష్ట్ర డీజీపీని ఉద్దేశించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను రాష్ట్ర పోలీసు అధికారుల సంఘం ఖండించింది. డీజీపీ శివధర్ రెడ్డిపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు సరికాదని సంఘం పేర్కొంది. గతంలో ఎన్నడూ లేనంత అప్రమత్తతతో పోలీసు వ్యవస్థ పనిచేస్తోందని తెలిపింది. రాష్ట్ర పోలీసు విభాగం చట్టానికి, ప్రజలకు ప్రాధాన్యతనిస్తోందని స్పష్టం చేసింది. పోలీసు శాఖ నిష్పక్షపాతంగా విధులు నిర్వర్తిస్తోందని సంఘం పేర్కొంది.

కేటీఆర్ ప్రస్తావించిన అన్ని ఘటనల్లో చట్ట ప్రకారం, నిష్పక్షపాతంగానే కేసులు నమోదు చేసినట్లు పోలీసు అధికారుల సంఘం తెలిపింది. డీజీపీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను కేటీఆర్ ఉపసంహరించుకుని, పత్రికా ముఖంగా క్షమాపణ కోరాలని డిమాండ్ చేసింది. సంస్కారయుతంగా, సభ్యతతో ప్రశ్నించాలని గుర్తు చేస్తున్నట్లు పేర్కొంది.

పోలీసు శాఖకు పింక్, రెడ్ బుక్ అంటూ ఏమీ లేవని, తమకు ఉన్నదల్లా పోలీసు బుక్ మాత్రమేనని, చట్ట ప్రకారం నడుచుకోవడమే తమ విధి అని డీజీపీ శివధర్ రెడ్డి ఇటీవల అన్నారు. డీజీపీ చేసిన వ్యాఖ్యలను విమర్శిస్తూ, కేటీఆర్ ఉపయోగించిన భాషపై రాష్ట్ర పోలీసు అధికారుల సంఘం అభ్యంతరం వ్యక్తం చేసింది.
KTR
KTR comments
Telangana DGP
Shivadhar Reddy
Telangana Police

More Telugu News