Thota Tharani: లెజెండరీ ఆర్ట్ డైరెక్టర్ తోట తరణికి ఫ్రాన్స్ ప్రభుత్వ విశిష్ట పురస్కారం
- ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ తోట తరణికి ఫ్రాన్స్ 'చెవాలియర్' పురస్కారం
- నవంబర్ 13న చెన్నైలో అవార్డు ప్రదానం
- తోట తరణిపై అభినందనల వెల్లువ
భారతీయ చలనచిత్ర పరిశ్రమ గర్వించదగ్గ ఆర్ట్ డైరెక్టర్, పద్మశ్రీ తోట తరణి మరో అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకున్నారు. ఫ్రాన్స్ ప్రభుత్వం అందించే అత్యున్నత పౌర పురస్కారం 'చెవాలియర్' అవార్డుకు ఆయన ఎంపికయ్యారు. నవంబర్ 13న చెన్నైలోని అలయన్స్ ఫ్రాంకైస్‌లో జరిగే కార్యక్రమంలో ఫ్రెంచ్ రాయబారి చేతుల మీదుగా తోట తరణి ఈ పురస్కారాన్ని అందుకోనున్నారు.
ఈ అరుదైన గౌరవం పొందిన ఆరో భారతీయుడిగా తోట తరణి నిలవనున్నారు. గతంలో దిగ్గజ దర్శకుడు సత్యజిత్ రే, నటులు శివాజీ గణేశన్, అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్, కమల్ హాసన్ ఈ పురస్కారాన్ని అందుకున్నారు.
రెండు జాతీయ అవార్డులు, మూడు నంది అవార్డులు, నాలుగు తమిళనాడు రాష్ట్ర అవార్డులతో పాటు 2001లో భారత ప్రభుత్వం ఆయనను పద్మశ్రీతో సత్కరించింది.
1978లో దిగ్గజ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన తెలుగు చిత్రం 'సొమ్మొకడిది సోకొకడిది'తో తోట తరణి తన కెరీర్‌ను ప్రారంభించారు. మణిరత్నం, శంకర్ వంటి అగ్ర దర్శకులతో కలిసి పనిచేసిన ఆయన 'నాయకుడు', 'సాగర సంగమం', 'గీతాంజలి', 'దళపతి', 'శివాజీ', 'దశావతారం', 'పొన్నియిన్ సెల్వన్' వంటి ఎన్నో క్లాసిక్ చిత్రాలకు ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేసి భారతీయ సినిమాపై తనదైన ముద్ర వేశారు.
'చెవాలియర్' అవార్డు విషయాన్ని ప్రకటించగానే తోట తరణిపై అభినందనలు వెల్లువెత్తాయి. తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్, ప్రముఖ నటుడు, దర్శకుడు ప్రభుదేవా బుధవారం సోషల్ మీడియా వేదికగా తోట తరణిని ప్రశంసించారు.
ఉదయనిధి స్టాలిన్ తన ఎక్స్ ఖాతాలో తమిళంలో స్పందిస్తూ, "తన అద్భుతమైన నైపుణ్యంతో ఊహలకు ప్రాణం పోసే ఆర్ట్ డైరెక్టర్ తోట తరణికి ఫ్రాన్స్ అత్యున్నత పురస్కారం 'చెవాలియర్' అవార్డు ప్రకటించడం చాలా సంతోషంగా ఉంది" అని పేర్కొన్నారు. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ ఇటీవల ఆవిష్కరించిన పెరియార్ చిత్రాన్ని తోట తరణి ఎంతో నైపుణ్యంతో రూపొందించారని ఆయన గుర్తుచేశారు. "తన కళతో ఖండాంతరాలు దాటి గుర్తింపు పొందిన తోట తరణి గారికి నా ప్రేమ, అభినందనలు" అని తెలిపారు.
ప్రముఖ కొరియోగ్రాఫర్, దర్శకుడు ప్రభుదేవా కూడా తోట తరణిని అభినందించారు. "ఫ్రాన్స్ ప్రభుత్వం అందించే ప్రతిష్ఠాత్మక చెవాలియర్ అవార్డుకు ఎంపికైన తోట తరణి గారికి హృదయపూర్వక అభినందనలు" అని తన ఎక్స్ టైమ్‌లైన్‌లో పోస్ట్ చేశారు.