Govinda: నేను క్షేమంగానే ఉన్నాను: బాలీవుడ్ నటుడు గోవిందా

Govinda I am safe says Bollywood actor
  • ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన అనంతరం మాట్లాడిన గోవిందా
  • వర్కౌట్లు చేయడం వల్ల అలసిపోయానన్న గోవిందా
  • గోవిందా నెల రోజుల నుంచి బిజీగా ఉంటున్నారన్న స్నేహితుడు
బాలీవుడ్ నటుడు గోవిందా (61) తాను క్షేమంగానే ఉన్నానని తెలిపారు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, తాను బాగానే ఉన్నట్లు వెల్లడించారు. వర్కౌట్లు చేయడం వల్ల తాను అలసిపోయానని తెలిపారు.

వర్కౌట్ల కంటే యోగా, ప్రాణాయామం ఆరోగ్యానికి చాలా మంచిదని ఆయన అభిప్రాయపడ్డారు. యోగా, ప్రాణాయామానికి తన జీవితంలో ఎంతో ప్రాధాన్యత ఉందని ఆయన అన్నారు.

గోవిందా గత నెల రోజులుగా చాలా బిజీగా ఉంటున్నారని, అందువల్ల ఇలా జరిగి ఉండవచ్చని గోవిందా స్నేహితుడు, లాయర్ బిందాల్ వెల్లడించారు.

విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినట్లు తెలిపారు. ఆసుపత్రిలో చికిత్స అనంతరం ఆయన క్షేమంగా ఇంటికి చేరుకున్నట్లు వెల్లడించారు. గోవిందా మంగళవారం అర్ధరాత్రి స్పృహ కోల్పోయారు. దీంతో జుహూలోని ఓ ఆసుపత్రిలో ఆయనను చేర్పించారు. కొన్ని గంటల చికిత్స అనంతరం వైద్యులు ఆయనను డిశ్చార్జ్ చేశారు.
Govinda
Govinda health
Bollywood actor Govinda
Govinda discharged
Govinda yoga

More Telugu News