Ramakrishna fighter: ఏం చెప్పమంటారు .. ఒళ్లంతా గాయాలే: ఫైటర్ రామకృష్ణ

Fighter Ramakrishna Interview
  • ఫైటర్ గా 36 ఏళ్ల అనుభవం 
  • వేయి సినిమాలకి పైగా చేసిన రామకృష్ణ 
  • అప్పట్లో రోజుకి 130 రూపాయలు ఇచ్చేవారని వెల్లడి
  • నెలలో కొన్ని రోజులే పని ఉంటుందని వివరణ 
  • క్షేమంగా ఇంటికి తిరిగొస్తామనే నమ్మకం లేదని వ్యాఖ్య
 
సినిమాలలో పోరాట సన్నివేశాలు ఎక్కువ థ్రిల్ కి గురిచేస్తూ ఉంటాయి. అయితే ఆ సన్నివేశాలలో హీరోలను గురించి తప్ప ఫైటర్స్ గురించి ఎవరూ పట్టించుకోరు. అలాంటి ఫైటర్ గా  వేయి సినిమాల వరకూ పనిచేసినవారే రామకృష్ణ. తాజాగా 'సుమన్' టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, తన కెరియర్ గురించిన అనేక విషయాలను ప్రస్తావించారు. 

"నేను ప్రకాశం జిల్లాలోని 'నందిగుంట పాలెం'లో పుట్టి పెరిగాను. నేను చదువుకున్నది నాల్గొవ తరగతి వరకే. సినిమా ఫీల్డ్ కి వస్తాననిగానీ .. ఈ స్థాయికి చేరుకుంటానని గాని నేను 'కల'లో కూడా అనుకోలేదు. 36 ఏళ్ల కెరియర్ లో సీనియర్ హీరోల నుంచి ఇప్పటి హీరోల వరకూ కలిసి పనిచేశాను. బాలీవుడ్ లో సల్మాన్ .. షారుక్ .. ఆమీర్ ఖాన్ వాళ్ల సినిమాలలోను ఫైటర్ గా చేశాను. వాళ్లంతా చాలా అభిమానించేవారు" అని అన్నారు. 

"అప్పట్లో ఫైట్స్ లో 'రోప్' .. 'బెడ్స్ ' ఉపయోగించడం ఉండేది కాదు. రియల్ గా చేయవలసిందే. అందువలన గాయాలు అవుతూ ఉండేవి. నా ఒళ్లంతా గాయాలే ఉన్నాయి. బాడీ అంతా డ్యామేజ్ అయింది. షూటింగుకి వెళితే, క్షేమంగా తిరిగి వస్తామనే గ్యారెంటీ లేదు. తట్టుకోలేక వెనక్కి వెళ్లిపోయి చిన్న చిన్న షాపులు పెట్టుకున్నవాళ్లు చాలామందే ఉన్నారు.  అప్పట్లో ఒక రోజుకి 130 రూపాయలు ఇచ్చేవారు. ఇప్పుడు 4 వేల వరకూ ఇస్తున్నారు. అయితే ఆ డబ్బులు రావడానికి రెండు .. మూడు నెలలు పడుతుంది. ఇప్పుడున్న పరిస్థితులలో ఫైటర్ గా రావడం వేస్ట్ అనే చెబుతాను" అని అన్నారు.      

Ramakrishna fighter
Telugu cinema fighters
Fight master Ramakrishna
Tollywood fight scenes
Telugu film industry
Salman Khan
Shahrukh Khan
Bollywood action
Telugu movie stunts

More Telugu News