Visakhapatnam: హైవేపై బోల్తాపడ్డ కంటెయినర్ లారీ.. విశాఖలో ట్రాఫిక్ జామ్

Visakhapatnam Container Lorry Overturns Disrupting Traffic
  • షీలానగర్ కూడలి వద్ద అదుపుతప్పి బోల్తా పడ్డ కంటెయినర్ లారీ
  • నడి రోడ్డులో కంటెయినర్ పడడంతో భారీగా నిలిచిన వాహనాలు
  • విమానాశ్రయం వరకు ట్రాఫిక్ జామ్
విశాఖపట్నంలో ఓ కంటెయినర్ లారీ అదుపుతప్పి బోల్తా పడింది. నడిరోడ్డుపై కంటెయినర్ పడడంతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. షీలానగర్ కూడలి వద్ద ఈ ప్రమాదం జరిగింది. హైవేపై కంటెయినర్ బోల్తాపడడంతో షీలానగర్ నుంచి విమానాశ్రయం వరకు వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వందలాది వాహనాలు నిలిచిపోయాయి.

పోర్టు రోడ్డు నుంచి ఎన్ఏడీ వైపు వెళ్తున్న కంటైనర్ లారీ షీలానగర్ కూడలి వద్ద అదుపుతప్పి బోల్తాపడిందని పోలీసులు తెలిపారు. ట్రాఫిక్‌ సిబ్బంది నాలుగు క్రేన్‌ల సహాయంతో కంటైనర్‌ను తొలగించే ప్రయత్నం చేస్తున్నట్లు వివరించారు.
Visakhapatnam
Visakhapatnam traffic
Container lorry accident
Sheelanagar
Vizag highway accident
Traffic jam Visakhapatnam
Port road
NAD junction
Visakhapatnam airport

More Telugu News