Jagan Mohan Reddy: గత వైసీపీ ప్రభుత్వం హిందువుల నమ్మకాలపై కక్ష సాధింపు ధోరణితో వ్యవహరించింది: పంచుమర్తి అనురాధ

Panchumarthi Anuradha Targets Jagan Reddy Over Jail Time and Criminal Cases
  • జగన్‌పై 31 క్రిమినల్ కేసులు ఉన్నాయన్న అనురాధ
  • నమ్మకం లేని వారిని టీటీడీ చైర్మన్లుగా నియమించారని మండిపాటు
  • సుబ్బారెడ్డి, కరుణాకర్‌రెడ్డి నియామకాలపై తీవ్ర విమర్శ
వైసీపీ అధినేత జగన్ పై ఏపీ శాసనమండలి చీఫ్ విప్ పంచుమర్తి అనురాధ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. జగన్‌పై 31 క్రిమినల్ కేసులు ఉన్నాయని, ఆయన 16 నెలల పాటు జైలు శిక్ష అనుభవించి గత 16 సంవత్సరాలుగా బెయిల్‌పై బయట ఉన్నారని ఆమె ఆరోపించారు.

గత ఐదేళ్ల వైసీపీ పాలనపై అనురాధ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వం ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల నమ్మకాలపై కక్ష సాధింపు ధోరణితో వ్యవహరించిందని ఆమె ధ్వజమెత్తారు. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పవిత్రతను దెబ్బతీసే విధంగా నిర్ణయాలు తీసుకున్నారని విమర్శించారు.

శ్రీ వేంకటేశ్వరస్వామిపై ఏమాత్రం నమ్మకం లేని వైవీ సుబ్బారెడ్డి, కరుణాకర్‌రెడ్డి వంటి వారిని టీటీడీ చైర్మన్లుగా నియమించారని అనురాధ అన్నారు. వారి నియామకాల ద్వారా పవిత్రమైన తిరుమల క్షేత్రాన్ని అపవిత్రం చేశారని ఆమె మండిపడ్డారు. హిందూ ధర్మాన్ని, సంప్రదాయాలను కాలరాసేలా వైసీపీ ప్రభుత్వం వ్యవహరించిందని ఆమె ఆరోపించారు.
Jagan Mohan Reddy
Panchumarthi Anuradha
YSRCP
Andhra Pradesh Politics
Tirumala Tirupati Devasthanam
TTD
Hinduism
YV Subba Reddy
Criminal Cases

More Telugu News