Anu Emmanuel: నా కెరీర్‌తో అసంతృప్తిగా ఉన్నాను.. నటి అను ఇమ్మాన్యుయేల్ కీలక వ్యాఖ్యలు

Anu Emmanuel Expresses Dissatisfaction with Career Choices
  • ఇకపై రొటీన్ కమర్షియల్ సినిమాలు చేయనన్న అను ఇమ్మాన్యుయేల్
  • 'ది గర్ల్‌ఫ్రెండ్‌’ సంతృప్తినిచ్చిందని వెల్లడి 
  • సమాజంలో మహిళలపై ఎన్నో కట్టుబాట్లు ఉన్నాయని వ్యాఖ్య
అవకాశాల కోసం తాను ఆరాటపడనని, తన కెరీర్ పట్ల కొంత అసంతృప్తి ఉందని నటి అను ఇమ్మాన్యుయేల్ అన్నారు. కెరీర్ ఆరంభంలో చేసినట్లుగా రొటీన్‌ కమర్షియల్‌ చిత్రాల్లో ఇకపై నటించకూడదని నిర్ణయించుకున్నట్లు ఆమె స్పష్టం చేశారు. రష్మిక మందన్నతో కలిసి ఆమె నటించిన తాజా చిత్రం ‘ది గర్ల్‌ఫ్రెండ్‌’. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రస్తుతం థియేటర్లలో ప్రదర్శితమవుతోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అను ఇమ్మాన్యుయేల్ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
 
‘ది గర్ల్‌ ఫ్రెండ్‌’ చిత్రంలో పాత్ర చిన్నదే అయినా ఎంతో సంతృప్తిని ఇచ్చిందని పేర్కొంటూ, అమ్మాయిల గురించి ఒక మంచి విషయం చెప్పే సినిమా కాబట్టే నటించేందుకు ఒప్పుకున్నానని వెల్లడించింది. హాలీవుడ్‌లో లాగా హీరో, హీరోయిన్, విలన్ అనే తేడా లేకుండా అన్ని పాత్రలకు ప్రాధాన్యం ఇస్తూ దర్శకుడు రాహుల్ ఈ కథను తీర్చిదిద్దారని తెలిపింది. థియేటర్‌లో సినిమా చూస్తున్నప్పుడు కొన్ని సన్నివేశాలకు అబ్బాయిలు కూడా చప్పట్లు కొట్టడం చూసి తాను ఆనందించానని చెప్పుకొచ్చింది. 
 
కమర్షియల్ సినిమాల్లో ఓవర్ యాక్షన్ చేయిస్తారని, కానీ ఈ చిత్రంలో ‘దుర్గ’ పాత్ర కోసం చాలా సహజంగా నటించానని అను వివరించారు. సమాజంలో మహిళలకు ‘‘ఎలా మాట్లాడాలి, ఎలాంటి బట్టలు వేసుకోవాలి, ఎప్పుడు పెళ్లి చేసుకోవాలి వంటి ఎన్నో షరతులు ఉంటాయని, కానీ మగవాళ్లకు ఉద్యోగం, సంపాదన తప్ప మరేమీ ఉండవని వ్యాఖ్యానించింది. 
 
తన సినీ కేరీర్ పై అసంతృప్తిగానే ఉన్నా ‘‘పవన్ కల్యాణ్, అల్లు అర్జున్, నాని, కార్తి వంటి పెద్ద స్టార్లతో కలిసి నటించడం పట్ల ఓ సంతృప్తి వ్యక్తం చేసింది.  కొన్ని కమర్షియల్ చిత్రాలు చేసి ఉండకూడదని ఇప్పుడు అనిపిస్తోందన్నారు. నాలుగు డ్యాన్స్‌ స్టెప్పులు వేసి, కొన్ని డైలాగులు చెప్పడంతో నటిగా సంతృప్తి రాదన్నారు. అందుకే ఇకపై అలాంటివి చేయకూడదని నిర్ణయించుకున్నానని స్పష్టం చేసింది. ప్రస్తుతం కొన్ని కొత్త కథలు వింటున్నానని, ఒక సినిమాకు అంగీకారం కుదిరిందని, ఆ వివరాలను నిర్మాణ సంస్థే త్వరలో ప్రకటిస్తుందని ఇమ్మాన్యుయేల్ తెలిపారు.
Anu Emmanuel
The Girlfriend movie
Rashmika Mandanna
Rahul Ravindran
Telugu cinema
actress interview
commercial movies
Tollywood
Durga character
career dissatisfaction

More Telugu News