Johnny Master: మైనర్‌ బాలికను లోబరుచుకున్నాడు: జానీ మాస్టర్‌పై చిన్మయి తీవ్ర ఆరోపణలు

Chinmayi Sripada Alleges Johnny Master Involved with Minor Girl
  • జానీ మాస్టర్‌పై మరోసారి ఫైర్ అయిన సింగర్ చిన్మయి
  • మైనర్‌ను లైంగికంగా వేధించాడని తీవ్ర ఆరోపణలు
  • పలుకుబడితో కేసు నుంచి తప్పించుకోవాలని చూస్తున్నాడని విమర్శ
  • అతని భార్య ఫోన్ చేసి మాట్లాడొద్దని చెబుతోందని వెల్లడి
  • నిర్దోషిగా తేలితే అవార్డులు వస్తాయని, విజయోత్సవాలు చేసుకుంటారని వ్యాఖ్య
సినీ గాయని, సామాజిక కార్యకర్త చిన్మయి శ్రీపాద మరోసారి ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై సంచలన ఆరోపణలు చేశారు. మైనర్ బాలికపై లైంగిక వేధింపుల కేసులో జానీ మాస్టర్ తన పలుకుబడిని ఉపయోగించి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆమె తీవ్రంగా విమర్శించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ సుదీర్ఘ పోస్ట్ పెట్టారు.

జానీ మాస్టర్ కేసు చాలా క్లిష్టమైనదని, కొందరు దీన్ని ఇద్దరి సమ్మతితో జరిగిన అంశంగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని చిన్మయి ఆరోపించారు. "ఒక మేజర్ అయిన వ్యక్తి మైనర్ బాలికను లోబరుచుకున్నప్పుడు అది కచ్చితంగా మేజర్‌దే తప్పవుతుంది. బాధితురాలు సహకరించనప్పుడు బెదిరించి లొంగదీసుకోవడం దారుణం" అని ఆమె పేర్కొన్నారు.

ఈ విషయంపై తాను మాట్లాడిన ప్రతిసారి జానీ మాస్టర్ భార్య తనకు ఫోన్ చేసి మాట్లాడవద్దని చెబుతోందని చిన్మయి వెల్లడించారు. తమ నిర్దోషిత్వాన్ని నిరూపించే ఆధారాలు ఉన్నాయని ఆమె అంటున్నారని తెలిపారు. ఇండస్ట్రీలో ఉన్న పలుకుబడి కారణంగా జానీ మాస్టర్ ఈ కేసు నుంచి తప్పించుకోవాలని చూస్తున్నారని విమర్శించారు.

ఒకవేళ కోర్టు తీర్పు వారికి అనుకూలంగా వస్తే, ఇక అవార్డుల మీద అవార్డులు వస్తాయని, అతన్ని విమర్శించిన వారే అతని నిర్దోషిత్వం గురించి గొప్పగా మాట్లాడతారని ఎద్దేవా చేశారు. "మైనర్ బాలికలతో శృంగారాన్ని థ్రిల్‌గా భావించే మహానుభావులకు ఈ అంశం మరింత ఉపకరిస్తుంది. భారీ స్థాయిలో విజయోత్సవాలు జరుపుకోవచ్చు. మైనర్లను వేధించి ఎలా తప్పించుకోవాలో వారికి కచ్చితంగా తెలుస్తుంది" అని ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

ఏదేమైనా, ఆ బాధితురాలైన అమ్మాయి విజయం సాధించాలని తాను ప్రార్థిస్తున్నానని చిన్మయి తెలిపారు. నిందితుడికి శిక్ష పడి, ఆమెకు న్యాయం జరగాలని ఆశిస్తున్నట్లు తన పోస్టులో ముగించారు. 
Johnny Master
Chinmayi Sripada
sexual harassment case
minor girl
allegations
Telugu cinema
social activist
MeToo movement
sexual assault
crime

More Telugu News