Naveen Yadav: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీదే గెలుపు: ఎగ్జిట్ పోల్ సర్వేలు

Naveen Yadav likely winner in Jubilee Hills exit polls predict
  • కాంగ్రెస్ పార్టీకి 46 శాతం నుంచి 48 శాతం ఓట్లు వస్తాయన్న ఎగ్జిట్ పోల్ సర్వేలు
  • బీఆర్ఎస్ పార్టీకి 42 శాతం వరకు ఓట్లు వస్తాయన్న ఎగ్జిట్ పోల్ సర్వేలు
  • బీజేపీకి 6 నుంచి 8 శాతం ఓట్లు వస్తాయన్న సర్వేలు
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలు సూచిస్తున్నాయి. దాదాపు అన్ని సర్వేలు కాంగ్రెస్ పార్టీ వైపే మొగ్గు చూపుతున్నాయి. మాగంటి గోపీనాథ్ ఆకస్మిక మరణంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈరోజు పోలింగ్ ముగియగా, 14వ తేదీన ఓట్ల లెక్కింపు జరగనుంది. సాయంత్రం 6 గంటలలోపు క్యూలైన్‌లో నిలబడిన వారికి ఓటు వేసేందుకు అధికారులు అవకాశం కల్పించారు.

వివిధ ఎగ్జిట్ పోల్ సర్వేల ప్రకారం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు 46 శాతానికి పైగా ఓట్లు వచ్చే అవకాశం ఉంది. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు 41 శాతం నుంచి 42 శాతం ఓట్లు, బీజేపీకి 6 నుంచి 8 శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలు వెల్లడిస్తున్నాయి.

వివిధ ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలు ఈ విధంగా ఇలా ఉన్నాయి

చాణక్య స్ట్రాటజీస్ - కాంగ్రెస్ 46 శాతం, బీఆర్ఎస్ 41 శాతం, బీజేపీ 6 శాతం.
పీపుల్స్ పల్స్ - కాంగ్రెస్ 48 శాతం, బీఆర్ఎస్ 41 శాతం, బీజేపీ 6 శాతం.
స్మార్ట్ పోల్ - కాంగ్రెస్ 48.2 శాతం, బీఆర్ఎస్ 42.1 శాతం, బీజేపీ 8 శాతం.
Naveen Yadav
Jubilee Hills by election
Telangana elections
Congress party
BRS party

More Telugu News