Jubilee Hills: జూబ్లీహిల్స్ పోలింగ్.. పలువురు ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలపై కేసు నమోదు

Jubilee Hills Bypoll Case Filed Against MLAs for Election Code Violation
  • ఎన్నికల ప్రవర్తనా నియామావళిని ఉల్లంఘించిన వారిపై కేసు నమోదు చేసిన పోలీసులు
  • బీర్ల ఐలయ్య, రామచంద్రనాయక్, రాందాస్‌లపై మధురానగర్ స్టేషన్లో రెండు కేసులు
  • మాజీ ఎమ్మెల్యేలు వినయ్ భాస్కర్, మెతుకు ఆనంద్‌పై బోరబండలో కేసు నమోదు
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన పలువురిపై హైదరాబాద్ పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ క్రమంలో ముగ్గురు ఎమ్మెల్యేలపై సైతం కేసులు నమోదు కావడం గమనార్హం. ఎమ్మెల్యేలు బీర్ల ఐలయ్య, రామచంద్ర నాయక్, రాందాస్‌లపై మధురానగర్ పోలీస్ స్టేషన్‌లో రెండు కేసులు నమోదు కాగా, మాజీ ఎమ్మెల్యేలు దాస్యం వినయ్ భాస్కర్, మెతుకు ఆనంద్‌లపై బోరబండ పోలీస్ స్టేషన్‌లో ఒక కేసు నమోదయింది.

ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ పోలీసులు స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య ప్రక్రియలో ఎన్నికలు శాంతియుతంగా, పారదర్శకంగా జరగాలంటే ప్రతి ఒక్కరు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని గౌరవించాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించినట్లు గుర్తిస్తే డయల్ 100కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని విజ్ఞప్తి చేశారు.
Jubilee Hills
Jubilee Hills Bypoll
Telangana Elections
Hyderabad Police
MLA Beerla Ilaiah
MLA Ramchandra Naik

More Telugu News