Nara Lokesh: అమెరికాలో నారా లోకేశ్ పర్యటన.. సభ కోసం భారీ ప్లానింగ్

Nara Lokesh Tour in USA Planned Big Meeting
  • డిసెంబర్ 6న డాలస్‌లో పర్యటించనున్న మంత్రి నారా లోకేశ్
  • పదివేల మంది ప్రవాస తెలుగువారితో భారీ సభకు ఏర్పాట్లు
  • సభా ఏర్పాట్లపై డాలస్ ఎన్నారై టీడీపీ సభ్యుల సమావేశం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అమెరికాలో పర్యటించనున్నారు. డిసెంబర్ 6వ తేదీన ఆయన డాలస్‌కు వెళ్లనున్నారు. ఈ సందర్భంగా పదివేల మంది ప్రవాస తెలుగువారితో ఒక భారీ సభను నిర్వహించేందుకు ఎన్నారై టీడీపీ విభాగం సన్నాహాలు చేస్తోంది. 

ఈ కార్యక్రమ ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు డాలస్‌లోని ఎన్నారై టీడీపీ సభ్యులు నిన్న సమావేశమయ్యారు. వంద మందికి పైగా సభ్యులు హాజరైన ఈ భేటీలో, లోకేశ్ సభను విజయవంతం చేసేందుకు ఒక స్పష్టమైన కార్యచరణను రూపొందించారు. సభ నిర్వహణను సజావుగా పూర్తిచేసేందుకు పలు కమిటీలను ఏర్పాటు చేశారు. కార్యక్రమ పర్యవేక్షణ కోసం ఒక స్టీరింగ్ కమిటీని, దానికి అనుబంధంగా భద్రత, భోజనాలు, స్వాగత ఏర్పాట్లు, వేదిక నిర్వహణ వంటి బాధ్యతల కోసం వేర్వేరు కమిటీలను ప్రకటించారు.

ఈ కమిటీలలో పనిచేసేందుకు పలువురు సభ్యులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తమ పేర్లను నమోదు చేసుకున్నారు. సమావేశానికి హాజరు కాలేకపోయిన వారు కూడా కమిటీలలో చేరవచ్చని నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా స్టీరింగ్ కమిటీ సభ్యుల పేర్లను ప్రకటించారు.

స్టీరింగ్ కమిటీ సభ్యులు వీరే:
సుధీర్ చింతమనేని, చంద్రశేఖర్ కాజా, నవీన్ యర్రంనేని, రామకృష్ణ గుళ్లపల్లి, కిషోర్ చలసాని, లోకేశ్ కొణిదల, దిలీప్ చంద్ర, పూర్ణ గరిమెళ్ల, అమర్ అన్నే, అనిల్ తన్నీరు తదితరులను స్టీరింగ్ కమిటీ సభ్యులుగా నియమించారు.
Nara Lokesh
Nara Lokesh USA tour
Telugu Desam Party
NRI TDP
Dallas
Andhra Pradesh
Telugu diaspora
IT Minister Andhra Pradesh
Education Minister Andhra Pradesh
Telugu community

More Telugu News