Andesree: అందెశ్రీకి ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు... సీఎం రేవంత్ ఆదేశాలు

Andesree Funeral with State Honors Ordered by CM Revanth
  • ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ (64) హఠాన్మరణం
  • హైదరాబాద్‌లోని నివాసంలో తీవ్ర అస్వస్థత
  • గాంధీ ఆసుపత్రిలో చికిత్సకు ముందే కన్నుమూత
  • అందెశ్రీ మృతిపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి
  • ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరపాలని ఆదేశం
ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ (64) సోమవారం హఠాన్మరణం చెందారు. ఆయన మృతిపట్ల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అందెశ్రీ అంత్యక్రియలను ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) రామకృష్ణారావును ఆదేశించారు.

హైదరాబాద్‌లోని తన నివాసంలో అందెశ్రీ ఇవాళ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయన్ను వెంటనే గాంధీ ఆసుపత్రికి తరలించారు. అయితే, ఆసుపత్రికి తీసుకువచ్చే లోపే ఆయన మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

అందెశ్రీ ఆకస్మిక మరణం పట్ల సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన అంత్యక్రియలను అధికార లాంఛనాలతో జరిపించాలని సీఎస్‌కు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు వెంటనే విడుదల చేసి, అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని అధికార యంత్రాంగాన్ని ముఖ్యమంత్రి ఆదేశించారు. 
Andesree
Andesree death
Telangana poet
Revanth Reddy
Andesree funeral
Government honors
Telangana government
Telugu writer

More Telugu News