Pawan Kalyan: పవన్ కల్యాణ్ కు సెల్యూట్ చేసిన కుంకీ ఏనుగులు... వీడియో ఇదిగో!

Pawan Kalyan Saluted by Kumki Elephants in Chittoor
  • చిత్తూరు జిల్లా పలమనేరులో పర్యటించిన పవన్ కళ్యాణ్
  • కుంకీ ఏనుగుల శిక్షణా శిబిరాన్ని సందర్శన
  • ఏనుగులకు స్వయంగా ఆహారం అందించిన డిప్యూటీ సీఎం
  • గజరాజుల నుంచి ఆశీర్వాదం తీసుకున్న పవన్
  • అనంతరం అటవీ శాఖ అధికారులతో సమీక్షా సమావేశం
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ క్షేత్రస్థాయి పర్యటనలను ప్రారంభించారు. ఇందులో భాగంగా ఆదివారం ఆయన చిత్తూరు జిల్లా, పలమనేరులోని కుంకీ ఏనుగుల శిక్షణా శిబిరాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన శిబిరంలోని ఏనుగులతో ప్రత్యేకంగా గడిపారు. వాటికి స్వయంగా ఆహారం అందించి, గజరాజుల నుంచి ఆశీర్వాదం తీసుకున్నారు.

పవన్ పర్యటన సందర్భంగా, కుంకీ ఏనుగులతో పరేడ్ నిర్వహించారు. కుంకీ ఏనుగులు పవన్ కు సెల్యూట్ చేశాయి. పవన్ కూడా గజరాజుల నుంచి వందనం స్వీకరించి, వాటికి అభివాదం చేశారు. 

కాగా, పవన్ కుంకీ శిబిరంలోని ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం అటవీ శాఖ ఉన్నతాధికారులతో ప్రత్యేకంగా సమీక్షా సమావేశం నిర్వహించారు. కుంకీ ఏనుగుల సంరక్షణ, శిక్షణ, వాటి బాగోగుల కోసం తీసుకుంటున్న చర్యల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణుల దాడులను నివారించేందుకు కుంకీ ఏనుగులను వినియోగిస్తున్న తీరు, వాటికి కల్పిస్తున్న సౌకర్యాలపై ఆరా తీశారు.

ఈ సందర్భంగా అటవీ శాఖ అధికారులు శిబిరం పనితీరును, తాము చేపడుతున్న కార్యక్రమాలను మంత్రి పవన్ కల్యాణ్‌కు వివరించారు. రాష్ట్రంలో అటవీ సంరక్షణ, వన్యప్రాణుల సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై మంత్రి అధికారులకు పలు సూచనలు చేసినట్లు సమాచారం. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పవన్ కల్యా నేరుగా ఏనుగుల శిబిరాన్ని సందర్శించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
Pawan Kalyan
Andhra Pradesh
Deputy Chief Minister
Kumki elephants
Chittoor district
Palamaneru
Forest Department
Wildlife conservation
Elephant training camp
AP News

More Telugu News