Richa Ghosh: మహిళల వరల్డ్ కప్ గెలిచిన టీమిండియా వికెట్ కీపర్ రిచా ఘోష్ కు డీఎస్పీ జాబ్
- భారత మహిళా క్రికెటర్ రిచా ఘోష్‌కు డీఎస్పీ పదవి
- నియామక పత్రం అందించిన సీఎం మమతా బెనర్జీ
- రూ. 34 లక్షల చెక్కును బహుకరించిన క్రికెట్ అసోసియేషన్
- ఫైనల్‌లో 34 పరుగులు చేసినందుకు ఈ బహుమతి అని చెప్పిన గంగూలీ
- రిచాను బంగ భుషణ్ అవార్డుతో సత్కరించిన బెంగాల్ ప్రభుత్వం
వరల్డ్ కప్ గెలిచిన భారత మహిళల క్రికెట్ జట్టు వికెట్ కీపర్-బ్యాటర్ రిచా ఘోష్‌కు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఉన్నతోద్యోగం ఇచ్చింది. ఆమెను రాష్ట్ర పోలీస్ శాఖలో డిప్యూటీ సూపరింటెండెంట్ (డీఎస్పీ)గా నియమించింది. శనివారం కోల్‌కతాలోని ప్రఖ్యాత ఈడెన్ గార్డెన్స్‌లో నిర్వహించిన ఒక కార్యక్రమంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్వయంగా రిచాకు నియామక పత్రాన్ని అందజేశారు.
మహిళల ప్రపంచకప్ గెలిచిన భారత జట్టులో సభ్యురాలైన రిచా ఘోష్‌ను సత్కరించేందుకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రిచాపై ప్రశంసలు, బహుమతుల వర్షం కురిసింది. రాష్ట్ర ప్రభుత్వం ఆమెను ప్రతిష్ఠాత్మక 'బంగ భుషణ్' అవార్డుతో సత్కరించింది. క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ (క్యాబ్) తరఫున సీఎం మమత ఆమెకు బంగారు బ్యాట్, బంతిని బహూకరించారు. దీంతో పాటు క్యాబ్ రూ. 34 లక్షల చెక్కును కూడా రిచాకు అందించింది.
ఈ కార్యక్రమంలో భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ కూడా పాల్గొన్నాడు. ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో రిచా 34 పరుగులు చేసినందుకే, ఆమెకు రూ. 34 లక్షల చెక్కును అందించినట్లు గంగూలీ వివరించాడు. "ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చినప్పుడు రిచా బాధ్యత చాలా కష్టమైనది. ఆడటానికి తక్కువ బంతులు ఉన్నాయి, అవసరమైన రన్ రేట్ కూడా ఎక్కువగా ఉంది. అయినప్పటికీ, ఆమె నైపుణ్యంతో ఆడి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించింది" అని గంగూలీ అన్నారు.
భవిష్యత్తులో రిచా భారత మహిళల క్రికెట్ జట్టుకు కెప్టెన్‌గా నాయకత్వం వహిస్తుందని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, గంగూలీ ఇద్దరూ ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ సన్మానంపై రిచా ఘోష్ స్పందించింది. "నెట్ ప్రాక్టీస్ సమయంలో నేను ఎప్పుడూ ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుంటాను. అది నాకు చాలా సహాయపడుతుంది. కష్టమైన పరిస్థితుల్లో సవాళ్లను స్వీకరించడం నాకు ఇష్టం. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించడాన్ని నేను ఆస్వాదిస్తాను" అని ఆమె తెలిపారు.
ఇదే కార్యక్రమంలో మమతా బెనర్జీ, సౌరవ్ గంగూలీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "గంగూలీ ఎన్నో ఏళ్లు భారత జట్టుకు కెప్టెన్‌గా ఉన్నాడు. క్రికెట్ పరిపాలనను కూడా సమర్థంగా నిర్వహించాడు. అలాంటి వ్యక్తి ఐసీసీకి అధిపతిగా ఉండాలి. ఏదో ఒక రోజు అతను ఆ పదవిని అందుకుంటాడని నేను నమ్ముతున్నాను. అతన్ని ఎవరూ ఆపలేరు" అని మమత పేర్కొన్నారు.