Womens Cricket: మహిళల క్రికెట్ సరికొత్త చరిత్ర.. వ్యూయర్‌షిప్‌లో పురుషులతో సమం

Womens Cricket Viewership Parallels Mens Cricket Led by Harmanpreet Kaur
  • మహిళల క్రికెట్‌కు అపూర్వ ఆదరణ
  • వరల్డ్ కప్ ఫైనల్‌కు 185 మిలియన్ల వ్యూయర్‌షిప్
  • పురుషుల టీ20 ప్రపంచకప్ ఫైనల్‌తో సమానమైన వీక్షణలు
  • టోర్నీ మొత్తం డిజిటల్ రీచ్ 446 మిలియన్లు
  • గత మూడు ప్రపంచకప్‌ల రికార్డులను అధిగమించిన గణాంకాలు
మహిళల క్రికెట్‌కు ప్రజాదరణ ఏ స్థాయిలో పెరిగిందో ఇటీవలి ప్రపంచకప్ ఫైనల్ వీక్షకుల సంఖ్య స్పష్టం చేస్తోంది. హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత మహిళల జట్టు తొలిసారి వన్డే ప్రపంచకప్ గెలిచిన చారిత్రక ఫైనల్ మ్యాచ్, ఏకంగా 185 మిలియన్ల వ్యూయర్‌షిప్‌ను సాధించి సంచలనం సృష్టించింది. ఈ సంఖ్య 2024లో రోహిత్ శర్మ సారథ్యంలోని పురుషుల జట్టు గెలిచిన టీ20 ప్రపంచకప్ ఫైనల్ వీక్షకుల సంఖ్యతో సమానం కావడం విశేషం.

దక్షిణాఫ్రికాపై 52 పరుగుల తేడాతో టీమిండియా విజయం సాధించి కప్ కైవసం చేసుకున్న ఈ ఫైనల్ మ్యాచ్‌కు అసాధారణమైన ఆదరణ లభించింది. పురుషుల క్రికెట్‌తో సమానంగా మహిళల క్రికెట్ కూడా వీక్షకులను ఆకట్టుకుంటోందని ఈ గణాంకాలు నిరూపిస్తున్నాయి. ఇది మహిళల క్రికెట్ ప్రజాదరణలో ఒక మైలురాయిగా నిలుస్తోంది.

కేవలం ఫైనల్ మ్యాచ్ మాత్రమే కాదు, మొత్తం టోర్నమెంట్‌కు కూడా భారీ స్పందన వచ్చింది. ఈ టోర్నమెంట్ మొత్తం డిజిటల్ రీచ్ 446 మిలియన్లకు చేరింది. ఈ సంఖ్య గత మూడు ఐసీసీ మహిళల ప్రపంచకప్‌ల మొత్తం రీచ్ కంటే ఎక్కువ కావ‌డం గమ‌నార్హం. అంతేకాకుండా నవంబర్ 2న భారత జట్టు చారిత్రక ట్రోఫీని అందుకుంటున్న క్షణంలో గరిష్ఠంగా 21 మిలియన్ల మంది వీక్షించారు. ఈ అద్భుతమైన గణాంకాలు మహిళల క్రికెట్‌లో ఒక కొత్త శకానికి నాంది పలుకుతున్నాయని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Womens Cricket
Womens World Cup
Harmanpreet Kaur
India Womens Team
Cricket Viewership
T20 World Cup
Rohit Sharma
Cricket Popularity
ICC Womens World Cup
South Africa

More Telugu News