Revanth Reddy: సీఎం రేవంత్ పుట్టినరోజు... మోదీ సహా ప్రముఖుల శుభాకాంక్షలు

Revanth Reddy Birthday PM Modi and Leaders Send Wishes
  • తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి వెల్లువెత్తిన పుట్టినరోజు శుభాకాంక్షలు
  • సోషల్ మీడియా వేదికగా విషెస్ తెలిపిన ప్రధాని నరేంద్ర మోదీ
  • రేవంత్‌కు మంచి ఆరోగ్యం, దీర్ఘాయుష్షు ప్రసాదించాలని ఆకాంక్ష
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు తన పుట్టినరోజు జరుపుకొంటున్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. రేవంత్ రెడ్డికి ఆ భగవంతుడు సంపూర్ణ ఆరోగ్యం, దీర్ఘాయుష్షును ప్రసాదించాలని ప్రధాని తన సందేశంలో ఆకాంక్షించారు.

ప్రధానితో పాటు ఇంకా పలువురు జాతీయ, రాష్ట్ర స్థాయి నేతలు కూడా సీఎం రేవంత్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, పంజాబ్ గవర్నర్ గులాబ్ చంద్ కటారియా, తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ కూడా రేవంత్ రెడ్డి ఆయురారోగ్యాలతో వర్థిల్లాలని ఆకాంక్షిస్తూ విషెస్ తెలిపారు.

కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నేత బండి సంజయ్ కుమార్ సైతం సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆ అమ్మవారి దయ, దీవెనలు రేవంత్ రెడ్డికి ఎల్లవేళలా ఉండాలని, నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో తెలంగాణ ప్రజలకు సేవ చేయాలని బండి సంజయ్ ఆకాంక్షించారు. ఇలా రాజకీయాలకు అతీతంగా పలువురు ప్రముఖులు సీఎంకు శుభాకాంక్షలు చెప్పడం పట్ల పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. 

Revanth Reddy
Telangana CM
Narendra Modi
Birthday wishes
Mamata Banerjee
Bandi Sanjay Kumar
Telangana politics
Indian politicians

More Telugu News