Arjuna Ranatunga: ఈ ఫొటోలో ఉన్నది రణతుంగేనా...!

Arjuna Ranatunga New Look Viral After Reunion with Sri Lanka Legends
  • గుర్తుపట్టలేనంతగా మారిపోయిన అర్జున రణతుంగ
  • సహచర క్రికెటర్లతో కలిసి ఓ కార్యక్రమంలో ప్రత్యక్షం
  • ఆయన కొత్త లుక్ ఫోటోను షేర్ చేసిన జయసూర్య
  • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న రణతుంగ ఫోటో
  • ఆయన ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేస్తున్న అభిమానులు
  • ఆడే రోజుల్లో భారీ కాయంతో కనిపించిన శ్రీలంక లెజెండ్
శ్రీలంకకు 1996లో ప్రపంచకప్ అందించిన కెప్టెన్ అర్జున రణతుంగ కొత్త లుక్ ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. ఒకప్పటి తన సహచర దిగ్గజ ఆటగాళ్లు సనత్ జయసూర్య, అరవింద డిసిల్వా, ముత్తయ్య మురళీధరన్‌తో కలిసి రణతుంగ ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్నాడు. తమిళ్ యూనియన్ 125వ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా వీరంతా ఒకేచోట చేరారు. ఇందుకు సంబంధించిన ఫోటోను జయసూర్య తన ఎక్స్ (గతంలో ట్విట్టర్) ఖాతాలో పోస్ట్ చేయడంతో అది క్షణాల్లో వైరల్‌గా మారింది.

ఈ ఫోటోలో ఎర్రటి కుర్తా ధరించి ఉన్న రణతుంగను చూసి అభిమానులు షాకయ్యారు. రణతుంగ ఆడే రోజుల్లో భారీ కాయంతో, ఎంతో బలంగా కనిపించేవాడు. కానీ ఈ ఫోటోలో మాత్రం గుర్తుపట్టలేనంతగా బక్కపలచగా మారిపోయాడు. దీంతో చాలామంది అభిమానులు ఆయన్ను గుర్తుపట్టలేకపోయారు. మరికొందరైతే ఆయన ఆరోగ్యం ఏమైందంటూ ఆందోళన వ్యక్తం చేస్తూ కామెంట్లు పెడుతున్నారు.

61 ఏళ్ల రణతుంగ 2000వ సంవత్సరంలో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. సౌతాఫ్రికాతో జరిగిన టెస్ట్ మ్యాచ్ ఆయన చివరి అంతర్జాతీయ మ్యాచ్. ఆ తర్వాత రాజకీయాల్లోకి ప్రవేశించి సింహళ ఉరుమయ పార్టీలో సభ్యుడిగా చేరారు.

1996 ప్రపంచకప్ ఫైనల్లో రణతుంగ కెప్టెన్సీలోని శ్రీలంక జట్టు ఆస్ట్రేలియాను ఓడించి చరిత్ర సృష్టించింది. ఆ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 241 పరుగులు చేసింది. అనంతరం ఛేదనలో శ్రీలంక 23 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ సమయంలో అరవింద డిసిల్వా (107) అద్భుత సెంచరీతో పాటు, కెప్టెన్ రణతుంగ (47 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడి జట్టుకు 7 వికెట్ల తేడాతో చిరస్మరణీయ విజయాన్ని అందించారు.
Arjuna Ranatunga
Sanath Jayasuriya
Aravinda de Silva
Muttiah Muralitharan
Sri Lanka Cricket
1996 World Cup
Tamil Union
Sri Lanka
Cricket Legends

More Telugu News