Ravichandran Ashwin: వరుణ్ చక్రవర్తి, అభిషేక్ శర్మలతో ఎక్కువ ప్రమాదం: ప్రత్యర్థి జట్లకు రవిచంద్రన్ అశ్విన్ సూచన
- బూమ్రా కంటే వారిద్దరే ప్రమాదమన్న రవిచంద్రన్ అశ్విన్
- ఏ జట్టైనా గెలవాలంటే వరుణ్, శర్మలే ప్రధాన అడ్డంకి అన్న అశ్విన్
- టిమ్ డేవిడ్.. వరుణ్ చక్రవర్తిని ఎదుర్కొన్న విధానం చూశాక తన అభిప్రాయానికి బలం చేకూరిందన్న అశ్విన్
టీ20 ఫార్మాట్లో ప్రత్యర్థులకు బుమ్రా కంటే వరుణ్ చక్రవర్తి, అభిషేక్ శర్మలతోనే ఎక్కువ ప్రమాదమని మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ అభిప్రాయపడ్డారు. అశ్విన్ తన యూట్యూబ్ ఛానల్ వేదికగా స్పందిస్తూ, భారత్‌లో జరగనున్న ట్వంటీ20 ప్రపంచ కప్‌ను ఏ జట్టైనా గెలవాలంటే వారు ప్రధానంగా రెండు అడ్డంకులను అధిగమించాలని పేర్కొన్నాడు. ఇంతకాలం తాను బూమ్రా గురించి చెప్పానని, ఇప్పుడు వరుణ్, శర్మల రూపంలో ప్రమాదం పొంచి ఉందని అన్నాడు.
ప్రస్తుత సిరీస్‌లో టిమ్ డేవిడ్... బౌలర్ వరుణ్ చక్రవర్తిని ఎదుర్కొన్న విధానం చూసిన తర్వాత తన అభిప్రాయానికి మరింత బలం చేకూరిందని అన్నాడు. వరుణ్ చక్రవర్తి, అభిషేక్ శర్మలను ఎదుర్కోగలిగితే ప్రత్యర్థి జట్లు విజయం సాధించగలవని అంచనా వేశాడు. ప్రస్తుత సిరీస్‌లో ఆస్ట్రేలియా అభిషేక్‌పై షార్ట్ బాల్ వ్యూహం అనుసరిస్తోందని, ప్రపంచ కప్‌లోనూ ఇలాంటి ప్రణాళికతోనే వెళతారని అభిప్రాయపడ్డాడు. వరుణ్ చక్రవర్తి విషయంలోనూ ఇలాంటి వ్యూహాలతో సిద్ధమవుతారని పేర్కొన్నాడు.