Katrina Kaif: కత్రినా కైఫ్ విషయంలో తప్పు చెప్పిన ప్రముఖ జ్యోతిష్యుడు... నెటిజన్ల భారీ ట్రోలింగ్

Katrina Kaif Vicky Kaushal Welcome Baby Boy Netizens Troll Astrologer
  • తల్లిదండ్రులైన బాలీవుడ్ జంట విక్కీ కౌశల్, కత్రినా కైఫ్
  • పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన కత్రినా
  • కూతురు పుడుతుందని చెప్పిన జ్యోతిష్కుడి జోస్యం విఫలం
బాలీవుడ్ ప్రముఖ జంట విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ ఇంట ఆనందం వెల్లివిరిసింది. ఈ దంపతులు తల్లిదండ్రులయ్యారు. కత్రినా కైఫ్ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. ఈ శుభవార్తను వారు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ప్రస్తుతం తల్లీబిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నట్లు తెలిపారు.

తమకు కుమారుడు జన్మించిన విషయాన్ని ప్రకటిస్తూ విక్కీ-కత్రినా ఒక భావోద్వేగ పోస్ట్ చేశారు. "మా జీవితంలో ఆనందం రెట్టింపు అయింది. అపారమైన ప్రేమ, కృతజ్ఞతతో మా మగబిడ్డను ఈ ప్రపంచంలోకి స్వాగతిస్తున్నాము" అంటూ తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. దీంతో అభిమానులు, సినీ ప్రముఖులు ఈ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

అయితే, ఈ సమయంలో ఓ జ్యోతిష్కుడిపై నెటిజన్లు విపరీతంగా ట్రోల్స్ చేస్తున్నారు. గతంలో అనిరుధ్ కుమార్ మిశ్రా అనే ప్రముఖ జ్యోతిష్కుడు.. కత్రినా-విక్కీ జంటకు మొదటి సంతానంగా ఆడపిల్ల పుడుతుందని జోస్యం చెప్పారు. అప్పట్లో ఆ వార్త బాగా వైరల్ అయింది. ఇప్పుడు వారికి మగబిడ్డ పుట్టడంతో, ఆ జ్యోతిష్కుడి అంచనా తప్పిందంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.

కొన్నేళ్ల పాటు ప్రేమించుకున్న విక్కీ కౌశల్, కత్రినా కైఫ్.. 2021 డిసెంబర్ 9న రాజస్థాన్‌లో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు. పెళ్లయిన నాలుగేళ్ల తర్వాత వీరు తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందారు. సినిమాల విషయానికొస్తే, విక్కీ కౌశల్ ఇటీవల ‘ఛావా’ చిత్రంతో విజయాన్ని అందుకోగా, ప్రస్తుతం ‘లవ్ అండ్ వార్’ సినిమాలో నటిస్తున్నారు. కత్రినా కైఫ్ చివరిసారిగా 2024లో విజయ్ సేతుపతితో కలిసి ‘మెర్రీ క్రిస్మస్‌’ చిత్రంలో కనిపించారు. 
Katrina Kaif
Vicky Kaushal
Katrina Kaif baby
Bollywood couple
Anirudh Kumar Mishra
Astrology prediction
Celebrity baby
Love and War movie
Merry Christmas movie
Chava movie

More Telugu News