Rahul Gandhi: ప్రచారంలో రాహుల్ గాంధీకి ఊహించని ప్రశ్న.. పెళ్లి గురించి అడిగిన బాలుడు!

Rahul Gandhi faces unexpected question about marriage during campaign
  • అరారీయాలో రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారం
  • ప్రచారం సందర్భంగా రాహుల్ గాంధీ వద్దకు వచ్చిన ఒక బాలుడు
  • పెళ్లి ఎప్పుడు చేసుకుంటారని ప్రశ్నించిన బాలుడు
  • తన పని పూర్తైన తర్వాత పెళ్లి చేసుకుంటానని రాహుల్ గాంధీ సమాధానం
బీహార్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి ఒక ఊహించని ప్రశ్న ఎదురైంది. అది కూడా ఒక బాలుడి నుండి కావడం గమనార్హం. అరారీయాలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న రాహుల్ గాంధీ వద్దకు ఒక బాలుడు రాగా, ఆయన ఆప్యాయంగా పలకరించి కాసేపు ముచ్చటించారు.

ఈ సమయంలో, "మీరు పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు?" అని ఆ బాలుడు ప్రశ్నించగా, తన పని పూర్తయిన తర్వాత చేసుకుంటానని రాహుల్ గాంధీ సమాధానమిచ్చారు. అనంతరం ఆ బాలుడు మీడియాతో రాహుల్ గాంధీతో జరిగిన సంభాషణ వివరాలను వెల్లడించాడు.
Rahul Gandhi
Bihar Elections
Congress
Indian National Congress
Rahul Gandhi marriage
Araria

More Telugu News