Delhi Crime: ఢిల్లీ నేపథ్యంలో సాగే క్రైమ్ థ్రిల్లర్ .. ఓటీటీలో!

Delhi Crime Series Update
  • క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో 'ఢిల్లీ క్రైమ్'
  • గతంలో వచ్చిన రెండు సీజన్లు 
  • ఈ నెల 13 నుంచి మూడో సీజన్ 
  • నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్     

ఓటీటీ ఫ్లాట్ పై థ్రిల్లర్ జోనర్ కి సంబంధించిన కంటెంట్ కి ఎక్కువ డిమాండ్ కనిపిస్తుంది. అందువలన ప్రతివారం ఈ తరహా కంటెంట్ ను అందించడానికి ఓటీటీ సెంటర్లు పోటీపడుతూ వుంటాయి. ఒకసారి అందించిన స్టోరీ లైన్ ను సీజన్ల వారీగా ప్రేక్షకులకు అందించే ప్రయత్నాలు ఎక్కువగా జరుగుతుంటాయి. అలాంటి సిరీస్ ల జాబితాలో 'ఢిల్లీ క్రైమ్' కూడా కనిపిస్తుంది. ఈ సిరీస్ నుంచి సీజన్ 3ను అందించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. 

నిర్భయ కేసుకు సంబంధించిన ఇన్వెస్టిగేషన్ ఎలా జరిగిందనే విషయంపై 2019లో ఫస్టు సీజన్ కొనసాగింది. 2022లో వచ్చిన రెండో సీజన్, వృద్ధులను లక్ష్యంగా చేసుకుని వారిని హతమార్చే గ్యాంగ్ ను పట్టుకునే విధానంపై నడుస్తుంది. ఇక హ్యూమన్ ట్రాఫికింగ్ అడ్డుకోవడం కోసం పోలీస్ డిపార్ట్మెంట్ చేసే ప్రయత్నంగా 'ఢిల్లీ క్రైమ్ సీజన్ 3' కొనసాగనుంది. ఈ నెల 13వ తేదీ నుంచి సీజన్ 3 స్ట్రీమింగ్ కానుంది.      

3వ సీజన్ కి సంబంధించిన ట్రైలర్ ను రీసెంటుగా వదిలారు. ఈ ట్రైలర్ కి అనూహ్యమైన రెస్పాన్స్ వస్తోంది. షెఫాలీ షా .. హ్యూమా ఖురేషి .. రాజేశ్ తైలాంగ్ .. రసిక దుగల్ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సిరీస్ కి, తనూజ్ చోప్రా దర్శకత్వం వహించాడు. గతంలోని రెండు సీజన్లకు మించి ఈ సీజన్ ఉంటుందనే టాక్ బలంగా వినిపిస్తోంది. చూడాలి మరి ఈ సీజన్ ఆశించిన స్థాయిలో ఉంటుందా లేదా అనేది. 

Delhi Crime
Delhi Crime Season 3
Shefali Shah
Netflix
Crime thriller series
OTT platform
Human trafficking
Huma Qureshi
Rajesh Tailang
Rasika Dugal

More Telugu News