Chinmayi Sripada: చిన్మయి ధైర్యంగా మాట్లాడింది .. కానీ కెరియర్ దెబ్బతింది: రాహుల్ రవీంద్రన్

Rahul Raveendran Interview
  • నటుడిగా .. దర్శకుడిగా రాహుల్ రవీంద్రన్
  •  'మీటూ'పై చిన్మయి ఫైట్ గురించిన ప్రస్తావన
  • ఆ సమయంలో ఆమెకి అవకాశాలు తగ్గాయని వెల్లడి
  • చాలామంది కెరియర్ క్లోజ్ అయిందని వ్యాఖ్య  

రాహుల్ రవీంద్రన్ నటుడిగా .. దర్శకుడిగా తన ప్రత్యేకతను చాటుకునే ప్రయత్నాలు చేస్తూ వెళుతున్నారు. ఆయన దర్శకత్వం వహించిన  'ది గర్ల్ ఫ్రెండ్' సినిమా రేపు థియేటర్లకు రానుంది. రష్మిక ప్రధానమైన పాత్రను పోషించిన ఈ సినిమాపై అందరిలో ఆసక్తి ఉంది. అలాంటి రాహుల్ రవీంద్రన్, 'సుమన్ టీవీ'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక విషయాలను గురించి ప్రస్తావించారు.  'మీటూ' ఉద్యమంలో తన భార్య 'చిన్మయి' వినిపించిన గళం గురించి ఆయన మాట్లాడారు. 

" ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్ గా .. సింగర్ గా చిన్మయి పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు ఆమె తన వాయిస్ ను వినిపించవలసి వచ్చింది. ఆ తరువాత తమకి కూడా అలాంటి అనుభవాలు చాలానే ఎదురయ్యాయంటూ చాలామంది బయటికి వచ్చారు. అప్పటివరకూ మనసులోనే దాచుకుని బాధపడుతూ వచ్చినవారు, ఒక్కసారిగా బరస్ట్ అయ్యారు. స్వయంగా కాల్ చేసి తమ అనుభవాలు చెప్పారు. అయితే చిన్మయి తన వాయిస్ వినిపించిన తరువాత ఆరు .. ఏడు సంవత్సరాలు తనకి పెద్దగా వర్క్ అనేది లేకుండాపోయింది" అని అన్నారు. 

ఈ విషయంలో చిన్మయి తన వాయిస్ వినిపించడం వలన ఆమె కెరియర్ దెబ్బతింది. తమిళంలో డబ్బింగ్ చెప్పకుండా చేశారు. చిన్మయి మాత్రమే తమ సినిమాలలో పాడాలి అనుకునే కొంతమంది పాడించారు. ఆ సమయంలో తెలుగులో ఆమె ఎక్కువగా పాటలు పాడింది. మలయాళ .. కన్నడ సినిమాలు కూడా అవకాశాలు ఇచ్చాయి. తనే కాదు ఆ సమయంలో ఈ విషయంపై గట్టిగా మాట్లాడిన వాళ్లందరి కెరియర్ దెబ్బతింది. కొంతమంది కెరియర్ క్లోజ్ అయింది. వాళ్లు అసలు ఇప్పుడు ఎక్కడా కనిపించడం లేదు కూడా" అని రాహుల్ రవీంద్రన్ అన్నారు.

Chinmayi Sripada
Rahul Ravindran
Me Too Movement
Chinmayi
The Girl Friend Movie
Telugu Cinema
Suman TV Interview
Drugging Artist
Singers
Career Impact

More Telugu News