Tirumala: తిరుమల ఘాట్ రోడ్డులో భారీ కొండ చిలువ

Tirumala Ghat Road Huge Python Spotted
  • భక్తుల కెమెరాకు చిక్కిన కొండచిలువ 
  • రాత్రి 9 గంటల సమయంలో కొండచిలువ సంచారం
  • వినాయక స్వామి ఆలయం దాటిన తర్వాత ఘటన
  • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో
తిరుమల కొండకు వెళ్లే భక్తులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. రెండో ఘాట్ రోడ్డులో ఓ భారీ కొండచిలువ కనిపించడంతో భయాందోళనలకు గురయ్యారు. మొన్న రాత్రి సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
 
వివరాల్లోకి వెళ్తే.. మొన్న రాత్రి సుమారు 9 గంటల సమయంలో కొందరు భక్తులు కారులో తిరుమలకు వెళ్తున్నారు. రెండో ఘాట్ రోడ్డులోని వినాయక స్వామి ఆలయం దాటిన తర్వాత రోడ్డు పక్కన ఓ భారీ కొండచిలువ నెమ్మదిగా కదులుతూ కనిపించింది. దాన్ని చూసిన భక్తులు వెంటనే తమ వాహనాన్ని ఆపి, ఫోన్‌లో వీడియో తీశారు.
 
అనంతరం ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది వేగంగా వైరల్ అయింది. రాత్రి వేళ ఘాట్ రోడ్లలో ప్రయాణించేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని ఈ ఘటన గుర్తుచేస్తోంది. శేషాచలం అడవుల్లో వన్యప్రాణుల సంచారం సాధారణమే అయినప్పటికీ, ఇంత పెద్ద కొండచిలువ రోడ్డుపై కనిపించడంతో ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Tirumala
Tirumala ghat road
second ghat road
python
Seshachalam forests
wildlife
viral video
devotees
Andhra Pradesh
Tirupati

More Telugu News