Revanth Reddy: అజారుద్దీన్‌కు మంత్రి పదవి ఇస్తే కిషన్ రెడ్డికి వచ్చిన ఇబ్బందేమిటి?: రేవంత్ రెడ్డి

Revanth Reddy Questions Kishan Reddy on Azharuddin Minister Post
  • హైదరాబాద్‌లో మూసీ రివర్ ఫ్రంట్ ఎందుకు ఉండకూడదో చెప్పాలని నిలదీత
  • నేను మొదట సెక్యులర్ భావాలు కలిగిన వ్యక్తినన్న రేవంత్ రెడ్డి
  • మోదీ, కేసీఆర్ ఇద్దరూ ఒకటేనని విమర్శ
అజారుద్దీన్‌కు మంత్రి పదవి ఇస్తే కిషన్ రెడ్డికి వచ్చిన ఇబ్బందేమిటని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు మద్దతుగా షేక్‌పేటలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడుతూ, జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పేరుతో బీజేపీ ఓట్లు అడుగుతోందని విమర్శించారు. నియోజకవర్గంలో రూ. 400 కోట్లతో అభివృద్ధి పనులను చేస్తున్నామని అన్నారు.

హైదరాబాద్ నగరంలో మూసీ రివర్ ఫ్రంట్ ఎందుకు కట్టకూడదో కిషన్ రెడ్డి చెప్పాలని నిలదీశారు. కిషన్ రెడ్డికి సవాల్ విసిరితే ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. తాను మొదట సెక్యులర్ భావాలు కలిగిన వ్యక్తినని అన్నారు. కొడంగల్‌లో తాను మూడుసార్లు గెలవడంలో మైనారిటీల సహకారం ఉందని వెల్లడించారు.

ఇరవై నెలల కాంగ్రెస్ పాలనలో మైనారిటీలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూశామని అన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇద్దరూ ఒకటే అన్నారు. ముస్లింలను బీఆర్ఎస్ మోసం చేస్తోందని అన్నారు. సవాల్ విసిరి పారిపోవడం కేటీఆర్‌కు అలవాటేనని అన్నారు.
Revanth Reddy
Azharuddin
Kishan Reddy
Telangana Politics
Congress Party
BRS
BJP
Hyderabad

More Telugu News