Bal Reddy: జగద్గిరిగుట్టలో అందరూ చూస్తుండగానే యువకుడిపై రౌడీషీటర్ హత్యాయత్నం

Rowdy Sheeter Attempts to Murder Youth in Jagadgirigutta Hyderabad
  • రోషన్ అనే యువకుడిపై కత్తితో దాడి చేసిన బాల్ రెడ్డి
  • దాడి ఘటనలో తీవ్రంగా గాయపడిన రోషన్ ఆసుపత్రికి తరలింపు
  • రక్తపు మడుగులో ఉన్న రోషన్‌ను చూసి భయాందోళనకు గురైన స్థానికులు
హైదరాబాద్ నగరంలోని జగద్గిరిగుట్ట బస్టాండులో ఒక దారుణ సంఘటన చోటుచేసుకుంది. అందరు చూస్తుండగానే ఓ రౌడీషీటర్ ఒక యువకుడిపై కత్తితో హత్యాయత్నం చేశాడు. రోషన్ అనే యువకుడిపై బాల్ రెడ్డి అనే రౌడీషీటర్, మరొక వ్యక్తితో కలిసి కత్తితో పలుమార్లు దాడికి పాల్పడ్డాడు.

ఈ దాడిలో రోషన్ తీవ్రంగా గాయపడటంతో అతడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. రక్తపు మడుగులో ఉన్న రోషన్‌ను చూసి స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఆర్థిక లావాదేవీల కోణంలోనే ఈ దాడి జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.
Bal Reddy
Jagadgirigutta
Hyderabad
Rowdy Sheeter
Attack
Stabbing
Crime

More Telugu News