Kamarottu 2: ఓటీటీ తెరపైకి కన్నడ హారర్ థ్రిల్లర్!

Kamaro 2 Movie Update
  • కన్నడ హారర్ థ్రిల్లర్ గా 'కమరో 2'
  • ఆగస్టులో థియేటర్స్ లో దిగిన సినిమా
  • ఈ నెల 7వ తేదీ నుంచి 'సన్ నెక్స్ట్'లో 
  • కన్నడలో మాత్రమే అందుబాటులోకి

ఈ మధ్య కాలంలో కన్నడ నుంచి మంచి ఇంట్రెస్టింగ్ కంటెంట్ ఉన్న సినిమాలు .. సిరీస్ లు వస్తున్నాయి. ముఖ్యంగా థ్రిల్లర్ జోనర్ కి సంబంధించిన కథలు మరింత ఆదరణ పొందుతున్నాయి. అలా ఇప్పుడు మరో కన్నడ హారర్ థ్రిల్లర్ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది .. ఆ సినిమా పేరే 'కమరో 2'. ఈ ఏడాది ఆగస్టు 22వ తేదీన థియేటర్లలో విడుదలైన ఈ సినిమా, ఈ నెల 7వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. 

2019లో కన్నడలో రూపొందిన 'కమరొట్టు చెక్ పోస్ట్' సినిమాకి అనూహ్యమైన రెస్సాన్స్ వచ్చింది. ఆ సినిమాకి సీక్వెల్ గా నిర్మితమైనదే 'కమరో 2'. పవన్ గౌడ నిర్మించిన ఈ సినిమాకి పరమేశ్ దర్శకత్వం వహించాడు. రవిశ్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాలో, ప్రియాంక ఉపేంద్ర .. స్వామినాథన్ .. రజనీ భరద్వాజ్ .. నాగేంద్ర .. రాఘవేంద్ర రాజ్ కుమార్ ముఖ్యమైన పాత్రలను పోషించారు. 

 దెయ్యాలపై ఎవరి నమ్మకాలు వారికి ఉంటాయి. లేవని కొట్టిపారేసేవారు కొందరైతే, ఉన్నాయో లేదో చూద్దామని రంగంలోకి దిగేవారు మరికొందరు. ఆ రెండో రకానికి చెందిన ఒక యువతి, అదృశ్యమైన తన సోదరిని వెతుక్కుంటూ 'కమరొట్టు హౌస్'కి వస్తుంది. అక్కడ ఆమెకి ఒక నిజం తెలుస్తుంది. అదేమిటి? అక్కడి నుంచి బయటపడటానికి ఆమె చేసిన ప్రయత్నం ఫలిస్తుందా? అనేది మిగతా కథ. 

Kamarottu 2
Kannada horror thriller
Priyanka Upendra
Kannada movies OTT
Horror movies streaming
Kannada thriller movies
Rajnani Bharadwaj
Paramesh
Raviಶ್

More Telugu News